Kantara: కాంతార మూవీ లవర్స్‌కి గుడ్‌ న్యూస్‌.. ‘వరాహ రూపం’ వచ్చేస్తోంది..

కన్నడ నాట విడుదలైన దేశం దృష్టిని ఆకర్షించిన చిత్రం 'కాంతార'. చిన్న సినిమాగా విడుదలై భారీ విజయాన్ని అందుకుందీ చిత్రం. కేవలం రూ. 16 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లను రాబట్టి సంచలనం సష్టించిందీ సినిమా. తెలుగులోనూ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది...

Kantara: కాంతార మూవీ లవర్స్‌కి గుడ్‌ న్యూస్‌.. 'వరాహ రూపం' వచ్చేస్తోంది..
Kantara Movie
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 25, 2022 | 7:10 PM

కన్నడ నాట విడుదలైన దేశం దృష్టిని ఆకర్షించిన చిత్రం ‘కాంతార’. చిన్న సినిమాగా విడుదలై భారీ విజయాన్ని అందుకుందీ చిత్రం. కేవలం రూ. 16 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లను రాబట్టి సంచలనం సష్టించిందీ సినిమా. తెలుగులోనూ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న కాంతార మూవీ ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తోంది. అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న కాంతారకు మూవీకి సంబంధించి ఓ వార్త అభిమానులను నిరాశపరించింది. సినిమాకు హైలెట్‌గా నిలిచిన ‘వరాహ రూపం’ పాటను ఓటీటీలో తొలగించిన విషయం తెలిసిందే.

వరాహరూపం పాటపై మలయాళ బ్యాండ్‌ ‘తెయ్యికుడుం బ్రిడ్జ్‌’ ఈచిత్రంలోని పాటపై న్యాయపోరాటానికి దిగింది. దీంతో వరాహ రూపం పాటలోని మ్యూజిక్‌ తొలగించే ఓటీటీ స్ట్రీమింగ్ మొదలు పెట్టారు. అయితే దీనిపై విచారణ చేపట్టిన కేరళలోని కోజికోడ్ కోర్టు వారి పిటిషన్‌ కొట్టివేసింది. వరాహ రూపం పాట ప్రదర్శనపై మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసింది. దీంతో ఈ పాటకోసం ఎంతో ఆతృతగా ఎదురు చూసినా అభిమానులకు నిరాశ ఎదురైంది.

కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ఈ పాట ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. పాట స్ట్రీమింగ్‌కు అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో చిత్ర యూనిట్ వరాహం పాటను తిరిగి యాడ్ చేయనున్నట్లు సమాచారం. దీంతో కాంతార మూవీ లవర్స్‌ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇన్ని రోజులుగా వరాహ రూపం పాట చుట్టూ నెలకొన్ని వివాదానికి కోర్టు తీర్పుతో తెరపడింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..