Nikhil Siddhartha: హీరోయిన్ పై ఫైర్ అయిన నిఖిల్.. ఇప్పటికీ కన్నీళ్లు ఆగవంటూ ట్వీట్..

ఇటీవలే కార్తికేయ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Nikhil Siddhartha: హీరోయిన్ పై ఫైర్ అయిన నిఖిల్.. ఇప్పటికీ కన్నీళ్లు ఆగవంటూ ట్వీట్..
Nikhil
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 25, 2022 | 6:09 PM

యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఇటీవలే కార్తికేయ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సుకుమార్ రైటింగ్స్ పై 18పేజెస్ అనే సినిమాలో నటిస్తున్నాడు నిఖిల్. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే తాజాగా నిఖిల్ ఒక స్టార్ హీరోయిన్ పై ఫైర్ అయ్యాడు. ఆ హీరోయిన్  ఎవరో కాదు బాలీవుడ్ నటి రిచా చద్దా. ఈ అమ్మడు రీసెంట్ గా దేశ సైన్యాన్ని అవమాన పరిచేవిధంగా ట్వీట్ చేసింది. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖులతోసహా నెటిజన్లు ఈ అమ్మడి పై మండిపడుతున్నారు. తాజాగా నిఖిల్ కూడా రిచా చద్దా పై ఫైర్ అయ్యారు.

“galwan says hi” అంటూ రిచా చద్దా ట్వీట్ చేసింది ఈ ట్వీట్ పై నిఖిల్ స్పందిస్తూ. సైనిక దళాలను అవమానించే విధంగా పోస్ట్ లు పెట్టడం సరికాదని నిఖిల్ అన్నారు. సైనికుల త్యాగాల గురించి చదువుతుంటే తనకు ఇప్పటికీ కన్నీళ్లు ఆగవని నిఖిల్ చెప్పుకొచ్చారు. మన దేశ అర్మీని ఎప్పుడూ గౌరవించాలని అవమానించకూడదని అన్నారు. మన దేశ ఆర్మీని దయచేసి గౌరవించాలని దేశం తర్వాతే ఏదైనా అని తెలుసుకోవాలని నిఖిల్ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

ఇక ఇప్పటికే  రిచా చద్దా పై పెద్ద ఎత్తున్న విమర్శలు వస్తుండటంతో ఆమె  తన ట్వీట్ విషయంలో క్షమాపణలు కూడా తెలిపింది. వెంటనే ఆ ట్వీట్ ను డిలీట్ చేసింది కూడా.. అయినా నెటిజన్లు ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..