Mahesh Babu: బరువెక్కిన గుండెతోనే సెట్స్‌లోకి మహేష్.. త్రివిక్రమ్ మూవీ షూటింగ్‌

ఒకరి తర్వాత ఒకరు మహేష్ ను విడిచి పెట్టిపోవడంతో ఆయన ఎంతో మనోవేదనకు గురవుతున్నారట. పైకి అందరిని చిరునవ్వుతో పలకరిస్తూ దైర్యం చెప్తున్నప్పటికీ లోలోపల బాధపడుతూ..

Mahesh Babu: బరువెక్కిన గుండెతోనే సెట్స్‌లోకి మహేష్.. త్రివిక్రమ్ మూవీ షూటింగ్‌
Mahesh Babu
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 25, 2022 | 6:40 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు తీవ్ర దుఃఖంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది మహేష్ కుటుంబసభ్యులు అందరు వరుసగా కన్నుమూశారు. ఒకరి తర్వాత ఒకరు మహేష్ ను విడిచి పెట్టిపోవడంతో ఆయన ఎంతో మనోవేదనకు గురవుతున్నారట. పైకి అందరిని చిరునవ్వుతో పలకరిస్తూ దైర్యం చెప్తున్నప్పటికీ లోలోపల బాధపడుతూ.. ఒంటరిగా ఉన్న సమయంలో కన్నీరు మున్నీరవుతున్నారని తెలుస్తోంది. వరుసగా అన్న, అమ్మ. నాన్నను కోల్పోయారు మహేష్. ఈ ముగ్గురంటే మహేష్ కు ప్రాణం. చాలా సందర్భాల్లో వీరి గురించి ఎంతో గొప్పగా చెప్పారు. ఇప్పుడు ఆ ముగ్గురు దూరంకావడంతో మహేష్ కొండత భాదను మోస్తున్నారు.  మహేష్ కూడా దైర్యం చెప్పడం కుటుంబసభ్యుల వల్ల కావడం లేదని ఆయన సన్నిహితుల దగ్గరనుంచి సమాచారం అందుతుంది. అయితే మహేష్ ఈ సమయంలో ఒంటరిగా ఉండటం కంటే సినిమా సెట్ లో ఉండటమే మంచిదని కుటుంబసభ్యులు కూడా భావిస్తున్నారట. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ సినిమా షూటింగ్ కు హాజరవ్వాలని భావిస్తున్నారట.

మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది. అయితే ఈ మూవీ షూటింగ్ సమయంలోనే మహేష్ అన్న రమేష్ బాబు, తల్లి ఇందిరాదేవి, తండ్రి సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్యంతో ఒకరితర్వాత ఒకరు కన్నుమూశారు. దాంతో ఈ సినిమాకు బ్రేక్ పడింది. అయితే ఇక ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ ను మొదలు పెట్టాలని భావిస్తున్నారట మహేష్.

ఇవి కూడా చదవండి

ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ చేస్తామని ముందే అనౌన్స్ చేశారు మేకర్స్. అనుకున్న సమయానికి సినిమా విడుదలయ్యేలా షూటింగ్ ను శరవేగంగా జరపనున్నారని తెలుస్తోంది. త్వరలోనే మహేష్ సెట్స్ లోకి అడుగుపెడతారని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజాహెగ్డే నటిస్తోన్న విషయం తెలిసిందే. కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు త్రివిక్రమ్.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..