Shiva Rajkumar: శివ రాజ్ కుమార్ పాన్ ఇండియా మూవీ నుంచి వర్కింగ్ స్టిల్స్.. గోస్ట్ పోస్టర్స్ అదుర్స్

కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ హైస్ట్ థ్రిల్లర్ కి కన్నడ బ్లాక్ బస్టర్ ‘బీర్బల్’ చిత్ర దర్శకుడు శ్రీని దర్శకత్వంవహిస్తున్నాడు

Shiva Rajkumar: శివ రాజ్ కుమార్ పాన్ ఇండియా మూవీ నుంచి వర్కింగ్ స్టిల్స్.. గోస్ట్ పోస్టర్స్ అదుర్స్
Shiva Raj Kumar
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 25, 2022 | 8:53 PM

కన్నడ చక్రవర్తి డాక్టర్ శివరాజ్ కుమార్ నటిస్తున్న పాన్ ఇండియా ఫిలిం ‘ఘోస్ట్’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ హైస్ట్ థ్రిల్లర్ కి కన్నడ బ్లాక్ బస్టర్ ‘బీర్బల్’ చిత్ర దర్శకుడు శ్రీని దర్శకత్వంవహిస్తున్నాడు. ప్రముఖ రాజకీయనాయకులు, నిర్మాత సందేశ్ నాగరాజ్ తన సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఘోస్ట్ 28 రోజుల పాటూ సాగిన మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్ లో రూ 6 కోట్ల వ్యయంతో భారీగా వేసిన జైల్ ఇంటీరియర్ సెట్ లో చిత్రీకరణ జరుపుకుంది.

మొదటి షెడ్యూల్ కి సంబందించిన మేకింగ్ స్టిల్స్, వీడియో విడుదల చేశారు మేకర్స్. అర్జున్ జన్య అద్భుతమైన బిజీఎమ్ తో ఉన్న మేకింగ్ వీడియో చిత్రం ఎంత భారీ స్థాయిలో తెరకెక్కుతోందో తెలియజేస్తోంది. డిసెంబర్ రెండో వారం నుండి రెండో షెడ్యుల్ చిత్రీకరణ ప్రారంభమవుతుంది. ఈ షెడ్యుల్ కోసం ప్రిజన్ బయటి లుక్ సెట్ భారీ వ్యయం తో నిర్మిస్తున్నారు. కాగా టీం శివ రాజ్ కుమార్ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. గన్ పట్టుకుని తీక్షణంగా చూస్తున్న శివన్న తో ఉన్న ఘోస్ట్ న్యూ పోస్టర్ అంచనాలు పెంచుతోంది.

ప్రముఖ మలయాళ నటుడు జయరామ్ ఘోస్ట్ లో కీలక పాత్ర పోషిస్తుండగా ప్రశాంత్ నారాయణ్, అచ్యుత్ కుమార్, దత్తన్న, అవినాష్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. ‘ఘోస్ట్’ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. మస్తీ, ప్రసన్న వి ఎం డైలాగ్స్ రాస్తున్నారు. కె జి ఎఫ్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆర్ట్ డైరెక్టర్ శివ కుమార్ ఈ సినిమాకి పనిచేస్తున్నారు. పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య సంగీతాన్ని అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి
Ghost

Ghost

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే