Vikram Gokhale Passes Away: అనారోగ్యంతో ప్రముఖ నటుడు మృతి.. షాక్లో ఫిల్మ్ ఇండస్ట్రీ..
విక్రమ్ మరణంతో బాలీవుడ్ సినీ ప్రముఖులు షాకయ్యారు. ఆయన మృతి పట్ల సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు. అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరిన విక్రమ్... కొద్ది రోజులుగా కోమాలో ఉన్నారు.
బాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు విక్రమ్ గోఖలే కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో పుణెలోని దీనానాథ్ మంగేష్కర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆరోగ్య పరిస్థితి విషమించి నవంబర్ 26న మధ్యాహ్నం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. విక్రమ్ మరణంతో బాలీవుడ్ సినీ ప్రముఖులు షాకయ్యారు. ఆయన మృతి పట్ల సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు. అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరిన విక్రమ్… కొద్ది రోజులుగా కోమాలో ఉన్నారు. ఇటీవల ఆయన నెమ్మదిగా కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. అంతలోనే ఆరోగ్య పూర్తిగా విషమించి ఈరోజు కన్నుమూశారు.
విక్రమ్ గోఖలే 1971లో అమితాబ్ బచ్చన్ నటించిన ‘పర్వానా’ సినిమాతో కెరీర్‌ని ప్రారంభించారు. ఆయన హిందీ, మరాఠీ చిత్రాల్లో అద్భుతంగా నటించారు. అంతేకాకుండా ‘భూల్ భులయ్యా’, ‘మిషన్ మంగళ్’, ‘దే దానా దాన్’, ‘హిచ్కీ’, ‘నికమ్మ’, ‘అగ్నీపథ్’, హమ్ దిల్ దే చుకే సనమ్ వంటి చిత్రాల్లో కీలకపాత్రలలో నటించారు. విక్రమ్ గోఖలే పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. విక్రమ్ గోఖలే చివరిగా ‘నికమ్మ’ చిత్రంలో శిల్పా శెట్టి, అభిమన్యు దాసానితో కలిసి కనిపించారు.
మరాఠీ చిత్రం అనుమతిలో తన నటనకు 2010లో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును కూడా అందుకున్నారు. టెలివిజన్‌లో, అతను ఘర్ ఆజా పరదేశి, అల్ప్విరామ్, జానా నా దిల్ సే దూర్, సంజీవ్ని, ఇంద్రధనుష్ వంటి ప్రముఖ షోలలో కన్నుమూశారు. ఈరోజు సాయంత్రం పూణేలోని వైకుంఠ శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.