Amitabh Bachchan: కోర్టును ఆశ్రయించిన అమితాబ్ బచ్చన్.. కారణం ఏంటంటే
ఇండియన్ సినీ ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేశారు బిగ్‌బి అమితాబ్. అత్యంత చిన్న స్థాయి నుంచి యావత్ దేశం గర్వించే నటుడుగా ఎదిగిన బిగ్‌బి జీవితం ఎంతో మందికి ఆదర్శం.
బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ గురించి ఎంత చెప్పిన తక్కువే.. అమితాబ్ బచ్చన్.. ఈ పేరును ప్రస్తావించకుండా భారతీయ సినీ పరిశ్రమ ప్రస్థానం పూర్తి కాదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇండియన్ సినీ ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేశారు బిగ్‌బి అమితాబ్. అత్యంత చిన్న స్థాయి నుంచి యావత్ దేశం గర్వించే నటుడుగా ఎదిగిన బిగ్‌బి జీవితం ఎంతో మందికి ఆదర్శం. 80 ఏళ్ల వయసులోనూ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉన్నారు. మెగాస్టార్‌గా ఆడియన్స్ మనసులలో నిలిచిపోయిన బిగ్ బి.. ఇప్పుడు యాంకరింగ్‌లో కొత్తదనం తీసుకువచ్చారు. కౌన్ బనేగా కరోడ్ పతి 14 ద్వారా బుల్లితెర పై సందడి చేస్తున్నారు. తాజాగా అమితాబ్ బచ్చన్ కోర్టును ఆశ్రయించారు. అమితాబ్ బచ్చన్ అనుమతి లేకుండా తన పేరుని.. ఫోటోలు, గొంతును ఉపయోగించడాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ కోర్టును ఆశ్రయించారు.
బిగ్ బిగ్ పిటిషన్ ని విచారించిన ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అమితాబ్ వ్యక్తిగత హక్కులపై కీలక ఆదేశాలు జారీ చేసింది ఢిల్లీ హైకోర్టు. అమితాబ్ అనుమతి లేకుండా ఎవ్వరూ కూడా, సంస్థ గానీ ఆయన పేరు – ఫొటో లేదా వాయిస్ ని వాడకూడదని కోర్టు తీర్పు ఇచ్చింది. అలాగే అమితాబ్ వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేలా ఫ్లాగ్ చేసిన కంటెంట్ ను తొలగించాలని ఆదేశాలు జారీచేసింది.
ఈమేరకు ఎలక్ట్రానిక్స్ , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అధికారులు అలాగే టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను ఢిల్లీ కోర్టు ఆదేశించింది. ఇటీవలే అమితాబ్ ఉంచాయి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.