Upendra: ఉపేంద్ర ఆరోగ్యం పై క్లారిటీ.. అస్వస్థతకు అసలు కారణం ఇదేనట
దాంతో తమ అభిమాన హీరో, హీరోయిన్లు కాస్త అస్వస్థతకు గురైన సరే అభిమానులు ఆందోళన పడుతున్నారు. ఇటీవలే లోకనాయకుడు కమల్ హాసన్ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. జ్వరంతో కమల్ హాస్పటల్ లో జాయిన్ అయ్యారు.
ఇటీవల సినిమా ఇండస్ట్రీ ఒకొక్కరు అనారోగ్యానికి గురవ్వడం కలవర పెడుతోంది. ఇటీవల కొంతమంది సినిమా తారలు అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. దాంతో తమ అభిమాన హీరో, హీరోయిన్లు కాస్త అస్వస్థతకు గురైన సరే అభిమానులు ఆందోళన పడుతున్నారు. ఇటీవలే లోకనాయకుడు కమల్ హాసన్ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. జ్వరంతో కమల్ హాస్పటల్ లో జాయిన్ అయ్యారు. చికిత్స అనంతరం ఆయన డిశ్చార్చిజ్ అయ్యారు. తాజాగా కన్నడ నటుడు ఉపేంద్ర అనారోగ్యానికి గురయ్యారు. సినిమా షూటింగ్ లో ఉండగా ఒక్కసారిగా సెట్ లో కుప్ప కూలిపోయాడు. ఆయనను వెంటనే హాస్పటల్ లో జాయిన్ చేశారు. ఉపేంద్ర హాస్పటల్ లో జాయిన్ అవ్వడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన హీరోకు ఏమైందో తెలియక అభిమానులు కలవర పడుతున్నారు.
ఈ నేపథ్యంలో ఉపేంద్ర స్పందించారు. తన ఆరోగ్యం ప్రస్తుతం మెరుగుగానే ఉందని.. ఉపేంద్ర ఒక వీడియోను రిలీజ్ చేశారు. అభిమానులు కంగారు పడద్దని పేర్కొన్నాడు. ప్రస్తుతం తాను ‘యూఐ’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నానని తెలిపారు. షూట్ చేస్తున్న లొకేషన్లో దుమ్ము ఎక్కువగా ఉండటంతో కొంచెం ఇబ్బందికి గురయ్యానని, దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి వెళ్లి వచ్చానని తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగుందని చెప్పారు తెలిపారు.
ఇక ఉపేంద్ర అనారోగ్యానికి గురయ్యారని నిన్నటి నుంచి వార్తలు తెగ వైరల్ అయ్యాయి. ఉపేంద్ర శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడ్డారని ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారని వార్తలు బయటకు వచ్చాయి. దాంతో అభిమానులు కంగారు పడ్డారు. ఉపేంద్ర త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో అభిమానులు పోస్టులు పెట్టారు.