Kantara: మరొక భాషలో రిలీజ్‌కు రెడీ అవుతున్న సెన్సేషనల్ కాంతార..

ముందుగా కన్నడ భాషలో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. దాంతో ఈ సినిమాను ఇతర భాషల్లోకి రిలీజ్ చేశారు. విడుదలైన అన్ని భాషలో సంచలన విజయాన్ని అందుకుంది కాంతార

Kantara: మరొక భాషలో రిలీజ్‌కు రెడీ అవుతున్న సెన్సేషనల్ కాంతార..
Kantara
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 26, 2022 | 8:12 AM

లేటేస్ట్ సెన్సేషనల్ కాంతార సినిమా ఎన్ని రికార్డులు క్రియే చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కన్నడ స్టార్ హీరో రిషబ్ దర్శకత్వం వహించి నటించిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ముందుగా కన్నడ భాషలో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. దాంతో ఈ సినిమాను ఇతర భాషల్లోకి రిలీజ్ చేశారు. విడుదలైన అన్ని భాషలో సంచలన విజయాన్ని అందుకుంది కాంతార. ఈ సినిమాలో రిషబ్ శెట్టి నటన హైలైట్ అనే చెప్పాలి. సినిమా అంతా ఒక ఎత్తు.. క్లామాక్స్ 20 నిముషాలు మరో ఎత్తు.. థియేటర్స్ లో దుమ్మురేపిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ ఆకట్టుకుంటుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ కాంతారా సినిమాను స్ట్రీమింగ్ చేస్తోంది. ఈ సినిమాకు ఓటీటీలో కూడా మంచి వ్యూయర్ షిప్ వస్తోంది.

అయితే ఈ సినిమాలో వరహా రూపం సినిమాను తొలగించిన విషయం తెలిసిందే.. ప్రస్తతం ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమాలో వరాహ రూపం సాంగ్ ను తొలగించారు. ఈ పాట పై అభ్యంతరం వ్యక్తం అవడంతో ఈ పాట లేకుండా సినిమాను రిలీజ్ చేశారు. అయితే త్వరలోనే ఆ పాటను జత చేయనున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీలో హిందీ వర్షన్ ఇంతవరకు రిలీజ్ చేయలేదు.

త్వరలోనే హిందీ వర్షన్ ను కూడా రిలీజ్ చేయనున్నారు. అలాగే కాంతారా సినిమాను తులు భాషలో కూడా రిలీజ్ చేయనున్నారు.  ఈ క్రమంలోనే ఈ సినిమాని డిసెంబర్ రెండవ తేదీ తులు భాషలో విడుదల చేస్తున్నారట ఇప్పటికే ఈ భాషలో ఈ సినిమా డబ్బింగ్ పనులను పూర్తి చేసిన్నట్టు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి