Superstar Krishna: జీవకళ ఉట్టిపడేల సూపర్ స్టార్ విగ్రహలు.. కృష్ణ దశదినకర్మ రోజు ఏర్పాటు

సూపర్ స్టార్ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆయన అభిమానులు కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ముఖ్యంగా మహేష్ బాబు. ఈ ఏడాది మహేష్ కు కోలుకోలేని ఎదురు దెబ్బలు తగిలాయి.

Superstar Krishna: జీవకళ ఉట్టిపడేల సూపర్ స్టార్ విగ్రహలు.. కృష్ణ దశదినకర్మ రోజు ఏర్పాటు
Super Star Krishna Life
Follow us

|

Updated on: Nov 26, 2022 | 8:37 AM

సూపర్ స్టార్ కృష్ణ మరణాన్ని ఇప్పటికి అభిమానులు, కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. దాదాపు 350కు పైగా సినిమాలు చేసి తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ. ఇటీవలే అనారోగ్యంతో కృష్ణ కన్నుమూశారు. సూపర్ స్టార్ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆయన అభిమానులు కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ముఖ్యంగా మహేష్ బాబు. ఈ ఏడాది మహేష్ కు కోలుకోలేని ఎదురు దెబ్బలు తగిలాయి. అన్న, అమ్మ, నాన్న ఇలా ఒకరి తర్వాత ఒకరు కన్నుమూయడంతో మహేష్ ఎంతో మనోవేదనకు గురవుతున్నారని తెలుస్తోంది. ఇక కృష్ణ పెద్ద కర్మను ఈ నెల 27న హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలిరానున్నారు. ఇదిలా ఉంటే 27 ఏళ్ల వయసులో ఉన్న సూపర్‌స్టార్‌ కృష్ణ విగ్రహాన్ని తయారు చేశారు ప్రముఖ శిల్పి రాజ్‌కుమార్‌ వడయారు.

కృష్ణ దశదినకర్మకు ఈ విగ్రహం సిద్దం చేశారు. ఎన్నోవేల విగ్రహాలకు జీవకళ ఉట్టిపడే విధంగా తయారుచేసే రాజ్‌కుమార్‌ వడయార్‌.. అంబెడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో సూపర్‌ స్టార్‌ విగ్రహాన్ని కూడా సూపర్‌గా తయారుచేశారు. కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఈ విగ్రహాన్ని తయారుచేస్తున్నాడు. అయితే రెండు రోజుల్లోనే ఈ విగ్రహం తయారు చేయడం విశేషం. ఇంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో కృష్ణ విగ్రహాలు పెట్టేందుకు తయారుచేయాలని అభిమానులంత కోరుతున్నారు.

అయితే ఈ విగ్రహాలన్ని సూపర్‌స్టార్‌ నటించిన పాత్రల్లోనివే ఆర్డరిస్తున్నారు కొందరు అభిమానులు. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు విగ్రహం హైలెట్‌ కాబోతుంది. కాకినాడ, రాజమండ్రి, తిరుపతి, విజయవాడలో పెట్టేందుకు కాంస్య విగ్రహాలు తయారుచేయాలంటున్నారు అభిమానులు. అయితే కొత్తపేట నుంచి ఈ తయారుచేసిన విగ్రహాలను హైదరాబాద్‌కు తరలించారు.

ఇవి కూడా చదవండి
Krishna

Krishna