Macherla Niyojakavargam: డిజిటల్‌ ప్రీమియర్‌గా మాచర్ల నియోజకవర్గం.. ఓటీటీ స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?

ప్యూర్‌ పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా వచ్చిన మాచర్ల నియోజకవర్గం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే కలెక్టర్‌గా నితిన్‌ నటన, కృతిశెట్టి, క్యాథరిన్‌ల అందచందాలు అభిమానులను బాగానే ఎంటర్‌టైన్‌ చేశాయి. ముఖ్యంగా అంజలి రా రా రెడ్డి సాంగ్‌ సూపర్‌ హిట్‌గా నిలిచింది.

Macherla Niyojakavargam: డిజిటల్‌ ప్రీమియర్‌గా మాచర్ల నియోజకవర్గం.. ఓటీటీ స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?
Macherla Niyojakavargam
Follow us
Basha Shek

|

Updated on: Nov 26, 2022 | 7:14 AM

యూత్ స్టార్‌ నితిన్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం మాచర్ల నియోజకవర్గం. కృతిశెట్టి హీరోయిన్‌గా నటించగా, కేథిరిన్‌ కీలక పాత్రలో నటించింది. తెలుగమ్మాయి అంజలి ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించి కనువిందు చేసింది. రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. అప్పుడెప్పుడో ఆగస్టు 12న థియేటర్‌లో ఈ సినిమా విడుదలైంది. ప్యూర్‌ పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా వచ్చిన మాచర్ల నియోజకవర్గం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే కలెక్టర్‌గా నితిన్‌ నటన, కృతిశెట్టి, క్యాథరిన్‌ల అందచందాలు అభిమానులను బాగానే ఎంటర్‌టైన్‌ చేశాయి. ముఖ్యంగా అంజలి రా రా రెడ్డి సాంగ్‌ సూపర్‌ హిట్‌గా నిలిచింది. అందుకే ఈ సినిమాను ఓటీటీలోనైనా చూద్దామని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సినిమా థియేటర్లలో విడుదలై మూడు నెలలు పూర్తవుతున్నా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. తాజాగా ఈ ఎదురుచూపులకు అడ్డుకట్టపడింది. మాచర్ల నియోజకవర్గం డిజిటల్‌ ప్రీమియర్‌కు సిద్ధమైంది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జీ5 ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ప్రేక్షకుల ఎదురుచూపులకు తెరదించుతూ డిసెంబర్‌ 5న నితిన్‌ సినిమాను స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. రాజ్ కుమార్ ఆకెళ్ళ సమర్పణ లో శ్రేష్ట్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో సముద్ర ఖని విలన్‌ గా నటించాడు. రాజేంద్రప్రసాద్‌, వెన్నెల కిశోర్‌, మురళీ శర్మ, ఇంద్రజ, శుభలేఖ సుధాకర్‌, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషించారు. మణిశర్మ కుమారుడు మహతి స్వర సాగర్‌ స్వరాలు సమకూర్చారు. మరి థియేటర్లలో మాచర్ల నియోజకవర్గాన్ని వారు ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..