Prince OTT: ఓటీటీలోకి అడుగుపెట్టిన ప్రిన్స్‌..శివ కార్తికేయన్‌ సినిమాను ఎక్కడ చూడొచ్చంటే?

థియేటర్లలో ఓ మోస్తరు కలెక్షన్లతో సరిపెట్టుకున్న ప్రిన్స్‌ ఇప్పుడు డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టాడు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ ఈ సినిమా డిజిటల్‌ హక్కులను సొంతం చేసుకుంది. థియేట్రికల్‌ రన్‌ పూర్తి కావడంతో ఈరోజు నుంచి మూవీ స్ట్రీమింగ్‌ కానుంది.

Prince OTT: ఓటీటీలోకి అడుగుపెట్టిన ప్రిన్స్‌..శివ కార్తికేయన్‌ సినిమాను ఎక్కడ చూడొచ్చంటే?
Prince Movie
Follow us
Basha Shek

|

Updated on: Nov 25, 2022 | 8:06 AM

ప్రముఖ తమిళ హీరో శివ కార్తికేయన్‌ మొదటిసారి తెలుగులో నేరుగా నటించిన చిత్రం ప్రిన్స్‌. జాతిరత్నాలు సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన అనుదీప్‌ ఈ రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించాడు. ఉక్రెయిన్ బ్యూటీ మారియా ర్యాబోషప్క హీరోయిన్‌గా నటించింది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుష్కర్ రామ్ మోహన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. అక్టోబర్‌ 21న తెలుగుతో పాటు తమిళ్‌లో విడుదలైన ఈ చిత్రం యావరేజ్‌ టాక్ సొంతం చేసుకుంది. అయితే శివ కార్తికేయన్‌ నటన, మరియా అందాలతో పాటు అనుదీప్‌ టేకింగ్‌ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా జాతిరత్నాలు లాగే గిలిగింతలు పెట్టే కామెడీ సీన్లు ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి. థియేటర్లలో ఓ మోస్తరు కలెక్షన్లతో సరిపెట్టుకున్న ప్రిన్స్‌ ఇప్పుడు డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టాడు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ ఈ సినిమా డిజిటల్‌ హక్కులను సొంతం చేసుకుంది. థియేట్రికల్‌ రన్‌ పూర్తి కావడంతో ఈరోజు నుంచి మూవీ స్ట్రీమింగ్‌ కానుంది.

ప్రిన్స్‌ సినిమాలో సత్యరాజ్, ప్రేమి అమరన్, సతీష్ కృష్ణన్, రాహుల్, ఆనందరాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇక కథ విషయానికొస్తే.. ఆనంద్‌ (శివకార్తికేయన్‌) ఓ స్కూలు టీచర్‌. అతను పనిచేసే స్కూల్లోనే టీచర్‌గా చేరుతుంది బ్రిటిష్‌ అమ్మాయి జెస్సికా (మరియా). హీరో ఇండియన్‌ అబ్బాయి, హీరోయిన్‌ బ్రిటీష్‌ అమ్మాయి కావడంతో వీరి ప్రేమకు అడ్డంకులు వస్తాయి. దీంతో ఈ ప్రేమ పోరాటం కాస్తా రెండు దేశాల మధ్య వైరంగా మారుతుంది. మరి హీరో తన ప్రేమను గెలిపించుకున్నాడా లేదా అనేది కథ. ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడలేని వారు ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే