AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Galodu: ఓటీటీలోకి వచ్చేస్తున్న సుడిగాలి సుధీర్ గాలోడు.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే..

మినిమమ్ అంచనాలతో విడుదలైన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇందులో సుధీర్ సరసన గెహెనా సిప్పి నటించింది. విడుదలైన మొదటి రోజు నుంచే ఈ సినిమా మంచి

Galodu: ఓటీటీలోకి వచ్చేస్తున్న సుడిగాలి సుధీర్ గాలోడు.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే..
Sudigali Sudheer
Rajitha Chanti
|

Updated on: Nov 26, 2022 | 5:13 PM

Share

బుల్లితెరపై కమెడియన్‏గా కెరీర్ స్టార్ట్ చేసి ప్రస్తుతం వెండితెరపై హీరోగా మెప్పిస్తున్నాడు సుడిగాలి సుధీర్. తెలుగు రాష్ట్రాల్లో సుధీర్‏కు మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. అటు హీరోగా పలు చిత్రాల్లో నటిస్తునే.. యాంకర్‏గానూ సత్తా చాటుతున్నాడు. ఇప్పటికే సాఫ్ట్ వేర్ సుధీర్, 3 మంకీస్ చిత్రాలతో హీరోగా అలరించిన సుధీర్.. ఇటీవల గాలోడు సినిమాతో వెండితెరపై సందడి చేశారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీలో సుధీర్ ఫుల్ మాస్ లుక్‏లో కనిపించి ఆకట్టుకున్నాడు. మినిమమ్ అంచనాలతో విడుదలైన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇందులో సుధీర్ సరసన గెహెనా సిప్పి నటించింది. విడుదలైన మొదటి రోజు నుంచే ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టింది. విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ. 3 కోట్ల షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమా సుధీర్ కెరీర్‏లోనే సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది.

ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‏కు సంబంధించి ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ డీల్ కుదుర్చుకున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం సుధీర్ క్రేజ్ దృష్టిలో పెట్టుకుని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ మూవీని రూ. 5 కోట్లకు స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. మరోవైపు ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

ఇక కొంతకాలంగా జబర్దస్త్ కామెడీ షోకు దూరంగా ఉన్న సుధీర్.. ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా తెలిపారు. అలాగే ప్రముఖ ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న కామెడీ ఎక్సేంజ్ షోలోనూ అలరిస్తున్నారు.

Follow Us
మహిళలూ మీలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా? నిర్లక్ష్యం చేయకండి..
మహిళలూ మీలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా? నిర్లక్ష్యం చేయకండి..
బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ కాన్వాయ్‌పై కాల్పులు
బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ కాన్వాయ్‌పై కాల్పులు
ఉదయం నిద్రలేవగానే కళ్ల బరువు, వాపు వేధిస్తున్నాయా? కారణాలు ఇవే.. 
ఉదయం నిద్రలేవగానే కళ్ల బరువు, వాపు వేధిస్తున్నాయా? కారణాలు ఇవే.. 
పచ్చికొబ్బరి తింటున్నారా? రోజూ తినేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి
పచ్చికొబ్బరి తింటున్నారా? రోజూ తినేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి
ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా? ఈ ఆరోగ్య సమస్యలు రావచ్చు
ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా? ఈ ఆరోగ్య సమస్యలు రావచ్చు
6 బంతుల్లో 400 స్ట్రైక్ రేట్‌తో ఊచకోత.. 19 ఏళ్ల రికార్డ్ బ్రేక్
6 బంతుల్లో 400 స్ట్రైక్ రేట్‌తో ఊచకోత.. 19 ఏళ్ల రికార్డ్ బ్రేక్
జడ వేసుకుంటేనే గుడిలోకి ఎంట్రీ.. లేదంటే గేటు బయటే..
జడ వేసుకుంటేనే గుడిలోకి ఎంట్రీ.. లేదంటే గేటు బయటే..
ఈ పిల్లి చిత్రంలో దాగున్న మరో జీవిని 10 సెకన్లలో గుర్తిస్తే..
ఈ పిల్లి చిత్రంలో దాగున్న మరో జీవిని 10 సెకన్లలో గుర్తిస్తే..
ఆన్‌లైన్‌లో తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు.. విడుదలకు డేట్ ఫిక్స్
ఆన్‌లైన్‌లో తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు.. విడుదలకు డేట్ ఫిక్స్
సద్దుల బతుకమ్మ వేడుకల్లో విజయ్ దేవరకొండ, రష్మిక..
సద్దుల బతుకమ్మ వేడుకల్లో విజయ్ దేవరకొండ, రష్మిక..