SS.Rajamouli: జక్కన్న క్రేజ్ అంటే మాములుగా ఉండదు మరీ.. అమెరికా న్యూస్ పేపర్‏లో రాజమౌళిపై స్పెషల్ ఆర్టికల్..

ఇక మొన్నటి వరకు జపాన్‏లో సందడి చేసిన రాజమౌళి.. ఇప్పుడు గత కొద్ది రోజులుగా అమెరికాలో ఉంటూ ఆర్ఆర్ఆర్ సినిమాను మరింత ప్రమోట్ చేస్తూ అక్కడి ఫిలిం ఫెస్టివల్స్‏లో పాల్గొంటున్నాడు. అక్కడ కూడా జక్కన్న భారీగానే ఫాలోయింగ్ పెరిగిపోయింది.

SS.Rajamouli: జక్కన్న క్రేజ్ అంటే మాములుగా ఉండదు మరీ.. అమెరికా న్యూస్ పేపర్‏లో రాజమౌళిపై స్పెషల్ ఆర్టికల్..
Rajamouli
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 26, 2022 | 2:39 PM

బాహుబలి సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిన విషయమే. ఈ సినిమాతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేశాడు దర్శకధీరుడు రాజమౌళి. ఇక ఇప్పుడు ట్రిపుల్ ఆర్ మూవీతో హాలీవుడ్ దర్శకులను మెప్పించారు జక్కన్న. రాజమౌళి స్క్రీన్ ప్లే, టేకింగ్‏కు అందరూ ఫిదా అయ్యారు. కేవలం మనదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది ఆర్ఆర్ఆర్. ఇక మొన్నటి వరకు జపాన్‏లో సందడి చేసిన రాజమౌళి.. ఇప్పుడు గత కొద్ది రోజులుగా అమెరికాలో ఉంటూ ఆర్ఆర్ఆర్ సినిమాను మరింత ప్రమోట్ చేస్తూ అక్కడి ఫిలిం ఫెస్టివల్స్‏లో పాల్గొంటున్నాడు. అక్కడ కూడా జక్కన్న భారీగానే ఫాలోయింగ్ పెరిగిపోయింది. అమెరికా మీడియా, ప్రేక్షకులు జక్కన్నతో ఇంట్రాక్ట్ కావడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా రాజమౌళికి మరో అరుదైన గౌరవం లభించింది. అమెరికాలో ఎక్కువ సర్కులేషన్ ఉన్న పేపర్స్‏లో ఒకటైన లాస్ ఏంజిల్స్ టైమ్స్ పత్రికలో జక్కన్న పై స్పెషల్ ఆర్టికల్ రాశారు. పత్రికలోని ముందు పేజీ పూర్తిగా రాజమౌళి ఆర్టికల్ కనిపిస్తుంది. అందులో జక్కన్నను.. ట్రిపుల్ ఆర్ చిత్రాన్ని ప్రశంసిస్తూ.. ఆర్ఆర్ఆర్ దర్శకుడికి భారీ అవకాశాలు అంటూ హెడ్ లైన్ ఇచ్చారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతుంది. జక్కన్న పై ఆర్టికల్ రావడంతో ఆయన అభిమానులు ఖుషి అవుతున్నారు. ఒక టాలీవుడ్ దర్శకుడి గురించి అమెరికాలోని ప్రముఖ పత్రికలో మొదటి పేజిలో రావడం సినీ ప్రముఖులందరికీ పెద్ద విజయం. భారతీయ సినిమాకు ఇది నిజంగా గర్వకారణం. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటించగా.. అజయ్ దేవగన్, అలియా భట్, ఒలివియా మోరిస్ ఇతర కీలక పాత్రలు పోషించారు.

ఇవి కూడా చదవండి

ఇక ట్రిపుల్ ఆర్ అనంతరం జక్కన్న.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఈ సినిమా ఇప్పటివరకు తాను తెరకెక్కించిన సినిమాలన్నింటికి మించి ఉంటుందని జక్కన్న చెప్పడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.