Childhood Photo: ఈ ఫొటోలో కనిపిస్తున్న చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో గుర్తుపట్టారా..? ఇప్పుడు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ ఈ చిన్నది
అభిమాన హీరోయిన్ చిన్ననాటి ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ ఫొటోస్ వరకు ఫ్యాన్స్ ఎంతో ప్రేమగా పదిలంగా దాచుకుంటూ ఉంటారు. ఇక సోషల్ మీడియాలో అయితే ఓ రేంజ్ లో ఆ ఫోటోలను షేర్ చేస్తూ
సినిమా తారాలకు సంబంధించిన ఫోటోలుఎం వీడియోలు సోషల్ మీడియాలో చాల వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా హీరోయిన్స్ కు సంబందించినవి. తమ అభిమాన హీరోయిన్ చిన్ననాటి ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ ఫొటోస్ వరకు ఫ్యాన్స్ ఎంతో ప్రేమగా పదిలంగా దాచుకుంటూ ఉంటారు. ఇక సోషల్ మీడియాలో అయితే ఓ రేంజ్ లో ఆ ఫోటోలను షేర్ చేస్తూ హడావిడి చేస్తుంటారు. పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ళ కలల రాకుమారి. ప్రస్తుతం రాణిస్తున్న ముద్దుగుమ్మల్లో కొంతమంది చైల్డ్ ఆర్టిస్ట్ లుగా చేసి ఆకట్టుకున్నవారు కూడా ఉన్నారు. ఇప్పుడు వైరల్ అవుతున్న ఫొటోలోని చిన్నది కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించింది. ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకుల మనసులో స్థానం సంపాధించుకుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ సరసన చేరి ఇప్పుడు బిజీ హీరోయిన్ గా మారింది. ఎవరో గుర్తుపట్టారా.. ?
ఈ ముద్దుగుమ్మ ఎవరో కాదు క్యూట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ కీర్తిసురేష్. టాలీవుడ్ లో నేను శైలజ సినిమాతో పరిచయమైన ఈ భామ చైల్డ్ ఆర్టిస్ట్ గాను పలు సినిమాల్లో నటించి మెప్పించింది. పై ఫోటో మలయాళంలో కీర్తి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన కుబేరన్ సినిమాలోది.
కీర్తిసురేష్ హీరోయిన్ గా తమిళ్ సినిమాతో పరిచయమైనప్పటకి..మలయాళంలో పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది. 2015లో వచ్చిన ఇదు ఎన్న మాయం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కీర్తి.. ఆ తర్వాత అదే ఏడాది వచ్చిన నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిన్నది. ఇక ఇప్పుడు తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్ సినిమాలో చిరు చెల్లెలిగా కనిపించనుంది. అలాగే నాని నటిస్తున్న దసరా సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.