Rana-Miheeka: రానాపై ప్రశంసలు కురిపించిన మిహికా.. ఫోటోస్ షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్..

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు టచ్ లో ఉంటారు మిహికా. ఇక ఇప్పుడు తన భర్త రానాతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ అతడిపై ప్రశంసలు కురిపించారు.

Rana-Miheeka: రానాపై ప్రశంసలు కురిపించిన మిహికా.. ఫోటోస్ షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్..
Rana Miheeka
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 26, 2022 | 3:00 PM

గత కొద్దిరోజులుగా పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి దంపతులు వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. రానా సతీమణి మిహికా ప్రెగ్నెంట్ అంటూ రూమర్స్ నెట్టింట చక్కర్లు కొట్టాయి. దీంతో వారిద్దరికి అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు సైతం తెలిపారు. అయితే తన భార్య ప్రెగ్నెన్సీ పై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రానా క్లారిటీ ఇవ్వడంతో ఆ వార్తలకు తెరపడింది. ఇక తాజాగా మరోసారి వీరిద్దరి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట హల్చల్ చేస్తుంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు టచ్ లో ఉంటారు మిహికా. ఇక ఇప్పుడు తన భర్త రానాతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ అతడిపై ప్రశంసలు కురిపించారు.

” నాకు ఇంత గొప్ప జీవితం ఇచ్చిన మీకు అభినందనలు. మీ దారిలో నడుస్తున్నందుకు కృతజ్ఞతలు. అలాంటి విషయాల్లో మీరు ఒకరిగా ఉంటారు ” అంటూ రానాతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసింది మిహికా. ప్రస్తుతం వీరికి సంబంధించిన పోస్ట్ నెట్టింట తెగ వైరలవుతుండగా.. అభిమానులు తెగ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

రానా చివరిసారిగా న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి నటించిన విరాట పర్వం చిత్రంలో కామ్రెడ్ రవన్నగా కనిపించారు. ఆ తర్వాత తన బాబాయ్ తో కలిసి రానానాయుడు అనే వెబ్ సిరీస్‏ లో నటించారు.

View this post on Instagram

A post shared by Miheeka Daggubati (@miheeka)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.