AHA Open Theatre: వీకెండ్‌ను డిఫరెంట్‌గా ఎంజాయ్‌ చేద్దామనుకుంటున్నారా? అయితే, మీకోసమే థ్రిల్లింగ్‌ థీమ్‌..

వీకెండ్‌ను డిఫరెంట్‌గా ఎంజాయ్‌ చేద్దామనుకుంటున్నారా?. అయితే, మీకోసమే థ్రిల్లింగ్‌ థీమ్‌ని తీసుకొచ్చింది ఆహా. ఇంతకీ, అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

AHA Open Theatre: వీకెండ్‌ను డిఫరెంట్‌గా ఎంజాయ్‌ చేద్దామనుకుంటున్నారా? అయితే, మీకోసమే థ్రిల్లింగ్‌ థీమ్‌..
Open Theatre Hyderabad
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 27, 2022 | 6:52 AM

వీకెండ్‌ను డిఫరెంట్‌గా ఎంజాయ్‌ చేద్దామనుకుంటున్నారా?. అయితే, మీకోసమే థ్రిల్లింగ్‌ థీమ్‌ని తీసుకొచ్చింది ఆహా. ఇంతకీ, అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా.. మరో సరికొత్త కాన్సెప్ట్‌తో జనం ముందుకొచ్చింది. అంతరించిపోయిన వీధి సినిమాను మరిపిస్తూ ఓపెన్‌ ఎయిర్‌ మూవీ థీమ్‌ని తీసుకొచ్చింది ఆహా టీమ్‌. ఛిల్‌ విత్‌ ఫ్రైడే స్ప్రైట్‌ పేరుతో జనం దగ్గరకే సరికొత్త థియేటర్‌ ఎక్స్‌పీరియన్స్‌ని పరిచయం చేసింది.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ దగ్గర నోవాటెల్‌ హోటల్‌ ఓపెన్‌ ఏరియాలో బిగ్‌ స్క్రీన్‌పై సర్దార్‌ మూవీని ప్రదర్శించింది ఆహా టీమ్‌. మైదానంలో ప్రదర్శించిన సినిమాను చూసేందుకు ప్రేక్షకులు పెద్దఎత్తున వచ్చారు. ఛిల్‌ విత్‌ ఫ్రైడే స్ప్రైట్‌ కాన్సెప్ట్‌ చాలా బాగుందంటున్నారు ప్రేక్షకులు. ఇష్టమైన వాళ్లతో కలిసి ఓపెన్‌ ఏరియాలో పెద్ద స్క్రీన్‌పై సినిమా చూడటం థ్రిల్లింగ్‌ ఉందన్నారు బిగ్‌బాస్ కంటెస్టెంట్‌ అరియానా.

ఆహా తీసుకొచ్చిన ఈ ఓపెన్‌ ఎయిర్‌ మూవీ కాన్సెప్ట్‌ను ఎంజాయ్‌ చేయాలనుకుంటే ఆన్‌లైన్‌లో టికెట్స్‌ బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. వీకెండ్‌ను డిఫరెంట్‌గా ఎంజాయ్‌ చేయాలనుకునేవాళ్లకు ఇది బెస్ట్‌ ఆప్షన్‌ అంటోంది ఆహా టీమ్‌. మరి ఇంకెందుకు ఆలస్యం, నెక్ట్స్‌ ఫ్రైడేనే ఓపెన్‌ ఎయిర్‌ మూవీ థీమ్‌ను ఎక్స్‌పీరియన్స్‌ చేయండి. సంతోషంగా గడపండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్నైన్మెంట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..