NVS Exam Schedule 2022: నవోదయ విద్యాలయాల్లో 2,200 పోస్టులకు రాత పరీక్ష తేదీలు విడుదల.. ఏయే తేదీల్లో ఏ పరీక్షంటే..
నవోదయ విద్యాలయ సమితిలో 2022-23 విద్యాసంవత్సారినికి సంబంధించి 2,200ల పీజీటీ, టీజీటీ, ప్రిన్సిపల్ ఉద్యోగాల భర్తీకి ఎగ్జామ్ షెడ్యూల్ తాజాగా విడుదలైంది..

NVS Exam Schedule 2022
నవోదయ విద్యాలయ సమితిలో 2022-23 విద్యాసంవత్సారినికి సంబంధించి 2,200ల పీజీటీ, టీజీటీ, ప్రిన్సిపల్ ఉద్యోగాల భర్తీకి ఎగ్జామ్ షెడ్యూల్ తాజాగా విడుదలైంది.
షెడ్యూల్ ప్రకారం..
- టీజీటీ రాత పరీక్ష ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 29న రెండు షిఫ్టుల్లో జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి షిఫ్ట్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో షిఫ్ట్ పరీక్ష జరుగుతుంది.
- ఇతర టీచింగ్ పోస్టులకు నవంబర్ 30న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుంది.
- స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ 2022-23 పోస్టులకు నవంబర్ 28 నుంచి 30 వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగుతుంది.
- లిమిటెడ్ డిపార్ట్‌మెంటల్ ఎగ్జామినేషన్ 2022-23 (పీజీటీ) పోస్టులకు నవంబర్ 28 వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగుతుంది.
రాత పరీక్ష విధానం..
మొత్తం 150 ప్రశ్నలకుగానే 150 మార్కులకు 3 గంటల వ్యవధిలో పరీక్ష రాయవల్సి ఉంటుంది. ఆయా తేదీల్లో పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులు తప్పనిసరిగా తమతో పాటు అడ్మిట్ కార్డుతోపాటు, ఏదైనా గుర్తింపు కార్డును తీసుకు వెళ్లాలి. ఇతర వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి

CRIS Recruitment 2022: డిగ్రీ అర్హతతో ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగావకాశాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

AIIMS Bhopal Recruitment 2022: నెలకు రూ.81,200ల జీతంతో.. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో 125 ఉద్యోగాలు..

NALCO Recruitment 2022: నాల్కోలో 375 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు.. టెన్త్/ఐటీఐలో అర్హత ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు..

NIEPID Secunderabad Jobs: ఇంటర్/డిగ్రీ అర్హతతో సికింద్రాబాద్లోని నైపిడ్లో ఉద్యోగాలు.. నెలకు రూ.70 వేల జీతం..
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.