TSPSC AEE Exam Date 2022: టీఎస్పీయస్సీ ఏఈఈ పోస్టులకు తెరచుకున్న ఆన్‌లైన్‌ కరెక్షన్‌ విండో.. పరీక్ష ఎప్పుడంటే..

తెలంగాణ ప్రభుత్వ శాఖల్లోని 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టులకు ఆన్‌లైన్‌ కరెక్షన్‌ విండో ఈ రోజు తెరచుకుంది. దరఖాస్తు సమయంలో ఎవైనా వివరాలు తప్పుగా నమోదు చేసుకున్న అభ్యర్ధులకు మరో అవకాశం..

TSPSC AEE Exam Date 2022: టీఎస్పీయస్సీ ఏఈఈ పోస్టులకు తెరచుకున్న ఆన్‌లైన్‌ కరెక్షన్‌ విండో.. పరీక్ష ఎప్పుడంటే..
TSPSC Application
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 22, 2022 | 6:35 PM

తెలంగాణ ప్రభుత్వ శాఖల్లోని 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టులకు ఆన్‌లైన్‌ కరెక్షన్‌ విండో ఈ రోజు తెరచుకుంది. దరఖాస్తు సమయంలో ఎవైనా వివరాలు తప్పుగా నమోదు చేసుకున్న అభ్యర్ధులకు మరో అవకాశం ఇచ్చింది. ఈ పోస్టులకు రిజిస్ట్రేషన్‌ చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ లో నవంబర్‌ 22 వ తేదీ ఉదయం 10 గంటల నుంచి నవంబర్‌ 24వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు తప్పులను సరిచేసుకోవచ్చని టీఎస్పీయస్సీ ప్రకటన విడుదల చేసింది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులకు వచ్చే ఏడాది (2023) జనవరి 22వ తేదీన తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ రాత పరీక్ష నిర్వహించనుంది.

పరీక్ష తేదీకి వారం రోజుల ముందు హాల్ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని కమిషన్‌ సూచించింది. ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్‌ సెప్టెంబర్‌ 15 న విడుదల కాగా అదేనెల 22 నుంచి అక్టోబర్‌ 15వ తేదీ వరకు టీఎస్పీఎస్సీ ఆన్‌లైన్‌ దరఖాస్తులను స్వీకరించింది. పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.