Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google Layoff: సైలెంట్‌గా బాంబ్‌ పేల్చిన గూగుల్! తక్కువ పనితీరు కనబరుస్తోన్న ఉద్యోగులపై వేటు..

ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు గూగుల్‌కూడా సమాయాత్త మవుతోంది. ఫేస్‌బుక్‌, ట్విటర్‌, సిస్కో, అమెజాన్‌ సరసన తాజాగా గూగుల్‌ కూడా చేరబోతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. దీనిలో భాగంగా తక్కువ పనితీరు కనబరుస్తోన్న ఉద్యోగులను ముందుగా..

Google Layoff: సైలెంట్‌గా బాంబ్‌ పేల్చిన గూగుల్! తక్కువ పనితీరు కనబరుస్తోన్న ఉద్యోగులపై వేటు..
Google's parent Alphabet plans to cut 10,000 jobs
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 22, 2022 | 9:10 PM

ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు గూగుల్‌కూడా సమాయాత్త మవుతోంది. ఫేస్‌బుక్‌, ట్విటర్‌, సిస్కో, అమెజాన్‌ సరసన తాజాగా గూగుల్‌ కూడా చేరబోతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. దీనిలో భాగంగా తక్కువ పనితీరు కనబరుస్తోన్న ఉద్యోగులను ముందుగా ఇంటికి పంపించనున్నట్లు సమాచారం. అలాగే ఇకపై ఉద్యోగులకు ఉచ్చే ప్రోత్సాహకాలు, స్టాక్ అవార్డులను కూడా నిలిపివేయనుంది. గూగుల్‌ మాతృసంస్థ అయిన ఆల్ఫాబెట్ కొత్త మేనేజ్‌మెంట్ సిస్టంను అమలు చేస్తోందని నివేదికలు తెల్పుతున్నాయి. దీని ద్వారా టీమ్ లీడర్‌లు, మేనేజర్‌లు తక్కువగా పనితీరు ఉన్న ఉద్యోగులను గుర్తించగలరని తెల్పింది. పనితీరు ఆధారంగా 6 శాతం మంది లేదా 10,000 వరకు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నట్లు సమాచారం. వీరిని గుర్తించిన అనంతరం వచ్చే ఏడాది ప్రారంభం నుంచి గూగుల్ తొలగింపు ప్రక్రియ చేపట్టనుంది. ఐతే దీనికి సంబంధించి గూగుల్ ఇంతవరకు అధికారిక ప్రకటన వెలువరించలేదు.

యూకే పెట్టుబడి దారుహెడ్జ్ ఫండ్ బిలియనీర్ క్రిస్టోఫర్ హోన్- గూగుల్‌ మాతృసంస్థ అయిన ఆల్ఫాబెట్‌కు రాసిన లేఖలో కొన్ని ముఖ్య సూచనలు చేసింది. కంపెనీలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించాల్సిన అవసరం ఉందని, ఇతర డిజిటల్ కంపెనీలతో పోలిస్తే తమ ఉద్యోగులకు అధిక వేతనాలు ఇస్తున్నట్లు పేర్కొంది.

యూకే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ నివేదిక ప్రకారం.. గూగుల్ హెడ్‌కౌంట్ అధికంగా ఉందని, 2021లో ఆల్ఫాబెట్ ఉద్యోగి సగటు జీతం దాదాపు 2,95,884 డాలర్లు. ఇది మైక్రోసాఫ్ట్ సంస్థ తన సిబ్బందికి చెల్లించే జీతం కంటే 70 శాతం కంటే ఎక్కువ. యునైటెడ్ స్టేట్స్‌లోని 20 అతిపెద్ద టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు చెల్లించే దాని కంటే కూడా ఆల్ఫాబెట్ తన ఉద్యోగులకు 153 శాతం అధికంగా చెల్లిస్తోంది. యూఎస్ ఆధారిత టెక్‌ కంపెనీలైన ట్విటర్, అమెజాన్‌, మెటా వంటి సంస్థలు కేవలం నెల రోజుల వ్యవధిలో ఖర్చులను తగ్గించుకునేందుకు ఇప్పటికే చర్యలను ప్రారంభించాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి.