- Telugu News Photo Gallery Viral photos Do you know how you can earn lakhs of rupees from rubber farming?
Rubber Cultivation: రబ్బరు సాగు ఎలా చేస్తారో తెలుసా? 40 యేళ్లపాటు కాసుల వర్షం కురిపించే కామధేనువు..
ఆహార ఉత్పత్తుల ద్వారా మాత్రమేకాకుండా రబ్బరు వ్యవసాయం ద్వారా కూడా లక్షల ఆదాయాన్ని పొందవచ్చు. రబ్బరు వ్యవసాయం ప్రత్యేకత ఏంటంటే.. ఒక్కసారి రబ్బరు మొక్క నాటితే 40 ఏళ్ల పాటు ఆదాయం అర్జించవచ్చు. పైగా రబ్బర్ పంటకు..
Updated on: Nov 22, 2022 | 7:33 PM

ఆహార ఉత్పత్తుల ద్వారా మాత్రమేకాకుండా రబ్బరు వ్యవసాయం ద్వారా కూడా లక్షల ఆదాయాన్ని పొందవచ్చు. రబ్బరు వ్యవసాయం ప్రత్యేకత ఏంటంటే.. ఒక్కసారి రబ్బరు మొక్క నాటితే 40 ఏళ్ల పాటు ఆదాయం అర్జించవచ్చు. పైగా రబ్బర్ పంటకు పెట్టుబడి, శారీరక శ్రమ కూడా అవసరం లేదు. సులభ పద్ధతుల్లో రబ్బరు సాగు చేయడం ద్వారా ఏడాదికి లక్షల రూపాయల లాభం పొందవచ్చు.

రబ్బరు మొక్క 5 సంవత్సరాలలో చెట్టుగా మారి ఉత్పత్తిని ప్రారంభిస్తుంది. ఈ విధంగా దాదాపు 40 యేళ్ల పాటు ఉత్పత్తిని ఇస్తుంది. ఐతే రబ్బరు చెట్లు ఏపుగా పెరగాలంటే సూర్యరశ్మి చాలా అవసరం. ఈ మొక్కలకు రోజుకు 6 గంటల సూర్యకాంతి అవసరం.

రబ్బరు రైతులకు కేంద్ర ప్రభుత్వం, ప్రపంచ బ్యాంకు నుంచి లోను తీసుకునే వెసులుబాటు ఉంది. అడవిలో పెరిగే రబ్బరు చెట్లు సాధారణంగా 43 మీటర్ల పొడవు ఉంటాయి. వాణిజ్య ప్రయోజనాల కోసం పెంచిన చెట్లు కొంత చిన్నవిగా ఉంటాయి. రబ్బరు మొక్కల్లో 8000 జాతులు, 280 రకాలు ఉన్నాయి.

ఉష్ణ ప్రాంతాలు రబ్బరు సాగుకు అనువైన ప్రదేశాలు. రబ్బరు మొక్కల పెరుగుదలకు కనిష్ట ఉష్ణోగ్రత 25 °C , గరిష్ట ఉష్ణోగ్రత 34 °C అవసరం. 4 నుంచి 6 pH ఉన్న నేల రబ్బరు సాగు అనుకూలంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.

ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం రబ్బరు సాగులో నాల్గవ అతిపెద్ద ఉత్పత్తిదారుగా మన దేశం ఉంది. ముఖ్యంగా తమిళనాడు, కేరళ రబ్బరు ఉత్పత్తి చేసే ప్రధాన రాష్ట్రాలు. మహారాష్ట్ర, గోవా, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా రబ్బరు సాగు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా 4 లక్షల మందికి పైగా మహిళలు రబ్బరు తయారీ రంగంలో పనిచేస్తున్నారు.
