CRIS Recruitment 2022: డిగ్రీ అర్హతతో ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగావకాశాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన న్యూఢిల్లీలోని సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌.. 24 జూనియర్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌, జూనియర్‌ సివిల్‌ ఇంజినీర్‌, ఎగ్జిక్యూటివ్‌ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..

CRIS Recruitment 2022: డిగ్రీ అర్హతతో ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగావకాశాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
CRIS New Delhi
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 22, 2022 | 5:28 PM

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన న్యూఢిల్లీలోని సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌.. 24 జూనియర్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌, జూనియర్‌ సివిల్‌ ఇంజినీర్‌, ఎగ్జిక్యూటివ్‌/పర్సనల్/అడ్మినిస్ట్రేషన్‌/హెచ్‌ఆర్డీ, ఎగ్జిక్యూటివ్‌, ఫైనాన్స్‌ అండ్‌ అకకౌంట్స్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో పోస్టును బట్టి డిప్లొమా/గ్రాడ్యుయేషన్‌/ఎంబీఏ/పీజీ/పీజీ డిప్లొమా/ఎంబీఏ లేదా తత్సమాన కోర్సులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు డిసెంబర్‌ 31, 2022వ తేదీ నాటికి 22 నుంచి 28 యేళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఈ అర్హతలున్న అభ్యర్ధులు డిసెంబర్‌ 20, 2022వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. జనరల్‌/ఓబీసీ అభ్యర్ధులు రూ.1200లు, ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూబీడీ/ట్రాన్స్‌జండర్‌/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌/మహిళా అభ్యర్ధులు రూ.600లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ కంప్యూటర్ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.35,400ల జీతంతోపాటు ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.