Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana High Court: ‘ఎంబీబీఎస్‌ ప్రవేశాల్లో ఎన్‌సీసీ కోటా ఎందుకు అమలు చేయడం లేదు.. ?

తెలంగాణ మెడికల్ అడ్మిషన్లలో నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్‌సీసీ) విద్యార్ధులకు 1 శాతం రిజర్వేషన్‌ను అమలు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు సోమవారం (నవంబర్‌ 21) రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు..

Telangana High Court: 'ఎంబీబీఎస్‌ ప్రవేశాల్లో ఎన్‌సీసీ కోటా ఎందుకు అమలు చేయడం లేదు.. ?
Telangana High Court
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 22, 2022 | 3:40 PM

తెలంగాణ మెడికల్ అడ్మిషన్లలో నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్‌సీసీ) విద్యార్ధులకు 1 శాతం రిజర్వేషన్‌ను అమలు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు సోమవారం (నవంబర్‌ 21) రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. గతంలో జారీ చేసిన ప్రభుత్వ జీవోల ప్రకారం ఎన్‌సీసీ సర్టిఫికేట్లు ఉన్న విద్యార్ధులకు రిజర్వేషన్‌ను వర్తింపజేయాలి. ఐతే ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ప్రవేశాల కోసం డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ హెల్త్‌ వర్సిటీ నిర్వహించిన మొదటి రౌండ్‌ కౌన్సెలింగ్‌లో ఎన్సీసీ సర్టిఫికెట్లను పరిగణనలోకి తీసుకోకుండానే అర్హుల జాబితాను ప్రకటించారు. దీంతో అర్హులైన ఎన్‌సీసీ విద్యార్థులకు ఒక శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ జంగిటి లక్ష్మీ నరసింహ హైకోర్టులో పబ్లిక్‌ ఇంటరెస్ట్ లిటిగేషన్‌ (పిల్) వేశారు. ఎన్‌సీసీ కేటగిరీ కింద రిజర్వేషన్‌ను వర్తింపజేయకపోవడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21 కింద హక్కులను హరించడమే తప్ప మరొకటి కాదని పిటిషనర్ తరఫు న్యాయవాది గొట్టిపాటి కవిత తమ వాదనలను వినిపించారు. రెండో దశ కౌన్సెలింగ్‌కు ముందు ఎన్‌సీసీ కేటగిరీ కింద అర్హులైన వారిని పరిగణనలోకి తీసుకోవాలని, రిజర్వేషన్‌ను అమలు చేసేందుకు మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని న్యాయవాది కవిత కోరారు.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి నినాల జయసూర్య నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు అంగీకారం తెలుపలేదు. దీనిపై కౌంటర్‌ వేయాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, వైఎస్‌ఆర్‌ హెల్త్‌ వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్‌ తదితరులకు సోమవారం నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ధర్మాసనం న‌వంబ‌రు 21న‌ ఆదేశించింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

లైవ్ మ్యాచ్‌లో అవమానం.. ఒక్క మాటతో గోయెంకాకు ఇచ్చిపడేశాడుగా
లైవ్ మ్యాచ్‌లో అవమానం.. ఒక్క మాటతో గోయెంకాకు ఇచ్చిపడేశాడుగా
మధుమేహం ఉన్నవారు చెరుకు రసం తాగొచ్చా.. తాగకూడదా..?
మధుమేహం ఉన్నవారు చెరుకు రసం తాగొచ్చా.. తాగకూడదా..?
షాపింగ్ కోసం వెళ్తున్నారా.. ఈ టిప్స్ తెలుసుకోండి
షాపింగ్ కోసం వెళ్తున్నారా.. ఈ టిప్స్ తెలుసుకోండి
ఆది శంకర మఠంలో మే1న చక్ర చండీ యాగం నిర్వహణ.. పూర్తి వివరాలు
ఆది శంకర మఠంలో మే1న చక్ర చండీ యాగం నిర్వహణ.. పూర్తి వివరాలు
వీటిలో ఉప్పు కలిపితే మీ ఆరోగ్యానికి డేంజర్ బెల్స్ మోగినట్టే..!
వీటిలో ఉప్పు కలిపితే మీ ఆరోగ్యానికి డేంజర్ బెల్స్ మోగినట్టే..!
ఎవర్రా సామీ నువ్వు.. 19 బంతుల్లో ఒక్క బౌండరీ కొట్టలే..
ఎవర్రా సామీ నువ్వు.. 19 బంతుల్లో ఒక్క బౌండరీ కొట్టలే..
షుగర్ కు చెక్ పెట్టాలంటే ఉదయం లేవగానే ఈ నీళ్లు తాగాల్సిందే
షుగర్ కు చెక్ పెట్టాలంటే ఉదయం లేవగానే ఈ నీళ్లు తాగాల్సిందే
ఇంటర్‌ ఫస్ట్, సెకండ్ ఇయర్ 2025 ఫలితాలు వచ్చేశాయ్.. డైరెక్ట్ లింక్
ఇంటర్‌ ఫస్ట్, సెకండ్ ఇయర్ 2025 ఫలితాలు వచ్చేశాయ్.. డైరెక్ట్ లింక్
కోచ్‌గా కాదు ఓ అసలైన తండ్రిగా.. యువీ షాకింగ్ కామెంట్స్
కోచ్‌గా కాదు ఓ అసలైన తండ్రిగా.. యువీ షాకింగ్ కామెంట్స్
కెప్టెన్‌కి బహుమతిగా గోల్డ్ ఐఫోన్.. ఎత్తుకెళ్లిన తోటి ప్లేయర్
కెప్టెన్‌కి బహుమతిగా గోల్డ్ ఐఫోన్.. ఎత్తుకెళ్లిన తోటి ప్లేయర్