Tech lay offs 2022: భారీ సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపనున్న మరో టెక్ కంపెనీ.. కారణం ఇదే..

ఫేస్‌బుక్‌, అమెజాన్‌, నెటఫ్లిక్స్‌, స్నాప్‌ చాట్‌, ట్విటర్‌, జొమాటో బాటలో మరో దిగ్గజ సంస్థ తన కంపెనీ ఉద్యోగులను భారీగా తొలగించేందుకు సన్నాహాలు చేస్తోంది. నవంబర్‌ నెల పూర్తయ్యేల్లోగా మరెన్ని జాబ్స్‌..

Tech lay offs 2022: భారీ సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపనున్న మరో టెక్ కంపెనీ.. కారణం ఇదే..
Cisco to lay off over 4000 employees
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 22, 2022 | 2:08 PM

ఫేస్‌బుక్‌, అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌, స్నాప్‌ చాట్‌, ట్విటర్‌, జొమాటో బాటలో మరో దిగ్గజ సంస్థ తన కంపెనీ ఉద్యోగులను భారీగా తొలగించేందుకు సన్నాహాలు చేస్తోంది. నవంబర్‌ నెల పూర్తయ్యేల్లోగా మరెన్ని జాబ్స్‌ ఊడిపోతాయోనని ఉద్యోగుల్లో గుబులు పట్టుకుంది. ఎందుకుంటే పైన తెల్పిన సంస్థలన్నీ ఈ నెలలోనే ఉద్యోగులపై వేటు వేశాయి. ఇక తాజాగా ప్రముఖ టెలికం పరికరాల తయారీ సంస్థ సిస్కో కూడా దాదాపు 4,100ల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఈ సంస్థ కంపెనీల్లో దాదాపు 83 వేల మంది పనిచేస్తున్నారు. ఆర్ధిక మాంద్యం ముంచుకొస్తున్న తరుణంలో.. సిస్కో కంపెనీ రీబ్యాలెన్సింగ్ ప్రక్రియలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ విభాగాల్లో దాదాపు 5 శాతం మందిని తొలగిస్తున్నట్లు సమాచారం.

సిస్కో సీఈవో చక్ రాబిన్స్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఈ విధంగా అన్నారు. ‘కంపెనీ వ్యాపారాలను రీసైజింగ్‌ చేస్తున్నాం. ఖర్చు తగ్గించుకోవడంపై ప్రస్తుతం దృష్టి పెట్టాం. ఇది ఉద్యోగుల తొలగింపు మాత్రం కాదు. కేవలం రీబ్యాలెన్సింగ్‌ కోసమే. కంపెనీ వ్యవహారాలు చక్కబెట్టుకునేందుకు ఈ పద్ధతిని అనుసరిస్తున్నాం. ప్రక్రియ మొత్తం పూర్తయ్యే వరకు ఎంతమందిని తొలగిస్తున్నామనేది ఇప్పుడే చెప్పలేమని’ చక్ రాబిన్స్ తెలిపారు.

ఆర్ధిక మాంద్యం నుంచి గట్టెక్కేందుకు మెటా, ట్విటర్‌, సేల్స్‌ ఫోర్స్‌, మైక్రోసాఫ్ట్‌, స్ట్రైప్‌లు ఉద్యోగులకు పింక్‌ స్లిప్‌లు ఇస్తున్నాయి. ఇప్పడు ఆ సంస్థల జాబితాలో సిస్కో కూడా చేరింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.