AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MBBS in Hindi: ‘వైద్య విద్యను ప్రాంతీయ భాషలో అభ్యసిస్తే కెరీర్‌లో ఎదగలేరు.. అది సరైన నిర్ణయం కాదు’

మెడికల్ కోర్సులను ప్రాంతీయ భాషల్లో అందించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పలువురు వైద్యులు తప్పుబడుతున్నారు. మెడికల్‌ ఎడ్యుకేషన్‌ కేవలం పుస్తకాలు మాత్రమే చదివి నేర్చుకునేదికాదు..

MBBS in Hindi: 'వైద్య విద్యను ప్రాంతీయ భాషలో అభ్యసిస్తే కెరీర్‌లో ఎదగలేరు.. అది సరైన నిర్ణయం కాదు'
MBBS in regional language
Srilakshmi C
|

Updated on: Nov 21, 2022 | 8:18 PM

Share

మెడికల్ కోర్సులను ప్రాంతీయ భాషల్లో అందించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పలువురు వైద్యులు తప్పుబడుతున్నారు. గత అక్టోబర్‌ 16న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చేతుల మీదుగా ఎంబీబీఎస్‌ సబ్జెక్టులైన అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీలకు సంబంధించిన మూడు ఎంబీబీఎస్‌ హిందీ టెక్ట్స్‌ బుక్‌లను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. దేశంలోనే తొలిసారిగా హిందీ భాషలో ఎంబీబీఎస్‌ కోర్సును ఆ రాష్ట్రంలోనే ప్రారంభమైంది. ఇదే విధంగా మెడికల్‌, టెక్నికల్‌ కోర్సులకు సంబంధించి పాఠ్యపుస్తకాలను సైతం మరో ఎనిమిది ప్రాంతీయ భాషల్లో తీసుకొచ్చేందుకు కృషి జరుగుతోందని షా చెప్పారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా దీనిని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఇదే విధంగా ఇతర రాష్ట్రాల్లో కూడా మాతృభాషల్లో వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. ఇక తమిళనాడులో కూడా ఎంబీబీఎస్‌ కోర్సును తమిళ భాషలో ప్రవేశపెట్టడంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమై ఉందని, అందుకు సంబంధించి ముగ్గురు ప్రొఫెసర్లతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు గతవారం తెల్పింది. ఐతే ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ జాతీయ మాజీ అధ్యక్షుడు డాక్టర్ జె ఎ జయలాల్‌ ఈ నిర్ణయంతో విభేదించారు.

‘వైద్య కోర్సులను ప్రాంతీయ భాషల్లో బోధించాలనే నిర్ణయం గ్రామీణ ప్రాంత విద్యార్ధులకు మొదట్లో ప్రయోజనకరంగా ఉన్నా.. ఆ తర్వాత విజ్ఞానాన్ని పెంచుకోవడానికి, వారి కెరీర్‌కు ఏ మాత్రం ఉపయోగపడదు. వైద్య విద్య అనేది విశ్వవ్యాప్తమైనది. కేవలం భారత్‌లోనే ప్రాక్టీస్‌ చేసేది కాదు. ప్రాంతీయ భాషల్లో మెడికల్ విద్యనభ్యసించిన వారు, బయటి దేశాలకు వెళ్లి మరింత విజ్ఞానాన్ని పొందడం సాధ్యంకాదు. అలాగే మెడికల్‌ ఎడ్యుకేషన్‌ కేవలం పుస్తకాలు మాత్రమే చదివి నేర్చుకునేదికాదు. ఇంటర్నేషనల్‌ జర్నల్స్‌లో ప్రచురితమయ్యే జర్నల్స్‌, రీసెర్చ్‌ పేపర్లను అధ్యయనంచేయవల్సి ఉంటుంది. అధునిక వైద్య పద్ధతులను ప్రపంచమంతటా ఆచరిస్తున్నారు. ప్రాంతీయ భాషల్లో చదివినవారు ప్రాథమిక అవగాహన పొందవచ్చు. కానీ నిరంతంర అభివృద్ధి చేసుకోవల్సిన స్కిల్స్‌, నాలెడ్జ్‌ను పొందడంలో వెనుకబడిపోతారని’ ఆయన అన్నారు.

ప్రాంతీయ భాషల్లో వైద్య విద్యను అందించే బదులు మౌలిక సదుపాయాలు, పాఠశాల విద్యను మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తే విద్యార్ధుల భవిష్యత్తుకు ఉపయోగకరంగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ఎటువంటి ఆంగ్ల నేపథ్యం లేనప్పటికీ మెడికల్ విద్యను చక్కగా అభ్యసించడం మేము చూశాం. అవసరానికి అనుగుణంగా విద్యార్ధులు తమని తాము మెరుగుపరుచుకుంటారు. హిందీ లేదా మరేదైనా స్థానిక భాషలో విద్యను అందించడం వారి ఎదుగుదలకు అడ్డుపడుతుందని జయలాల్‌ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.