TS Medical Jobs: నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్‌! తెలంగాణలో 1,147 పోస్టులకు వచ్చే వారంలో నోటిఫికేషన్‌

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు ప్రభుత్వ బోధనాసుపత్రులు, మెడికల్ కాలేజీల్లో 1,147 అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి వచ్చే వారంలో నోటిఫికేషన్‌ విడుదలవ్వనుంది. ఈ మేరకు..

TS Medical Jobs: నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్‌! తెలంగాణలో 1,147 పోస్టులకు వచ్చే వారంలో నోటిఫికేషన్‌
Telangana Government
Follow us

|

Updated on: Nov 22, 2022 | 2:42 PM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు ప్రభుత్వ బోధనాసుపత్రులు, మెడికల్ కాలేజీల్లో 1,147 అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి వచ్చే వారంలో నోటిఫికేషన్‌ విడుదలవ్వనుంది. ఈ మేరకు మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) వారం రోజుల్లో ప్రకటన వెలువరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే వైద్యా విభాగంలో 969 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ నియామక ప్రక్రియకు సంబంధించి అర్హుల జాబితా కూడా విడుదల చేశారు. ఈ రోజు నుంచి నవంబర్‌ 25 వరకు ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది. తర్వాత మరో వారం రోజుల్లోగా సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్ల పోస్టుల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకుంటుంది. ఇది పూర్తవ్వగానే అసిస్టెంట్ ప్రొఫెసర్‌ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ విడుదల చేయాలనే యోచనలో ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ ఉంది. ఈ పోస్టులకు కూడా ప్రైవేటు ప్రాక్టీసుపై నిషేధం నిబంధన కొనసాగుతుంది.

కాగా ప్రస్తుతం నియామకాలు చేపడుతోన్న సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులపై కూడా ప్రైవేటు ప్రాక్టీసు నిషేధం నిబంధన ఉన్నప్పటికీ.. ఈ పోస్టులకు సుమారు 4800 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పోస్టులన్నీ ఎంబీబీఎస్‌ అర్హతతో కూడినవే కావడంతో ప్రైవేటు ప్రాక్టీసు నిషేధాన్ని పెద్దగా పట్టించుకోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టులన్నీ కూడా స్పెషలిస్టు, సూపర్‌ స్పెషలిస్టు ఉద్యోగాలు. వీటికీ ప్రైవేటు ప్రాక్టీసు నిషేధం నిబంధన ఉన్నట్లు ముందుగానే తెలియజేస్తే.. ఆసక్తి ఉన్న వాళ్లు మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు పోస్టింగ్‌ ఎక్కడ ఇచ్చినా పనిచేస్తారని వైద్యవర్గాలు భావిస్తున్నాయి. పీజీ మెడికల్ కోర్సు పూర్తి చేసిన తర్వాత ఏడాది పాటు సీనియర్‌ రెసిడెంట్‌గా పనిచేసినవారు ఈ పోస్టులకు అర్హులు. అలాగే అనుభవం కూడా ఉండాలి. అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ వచ్చే మూడు నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?