SBI Recruitment 2022: రాత పరీక్షలేకుండా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే నెలకు రూ.78 వేల జీతంతో జాబ్‌..

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచుల్లో.. రెగ్యులర్ ప్రాతిపదికన 55 స్పెషలిస్ట్‌ క్యాడర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

SBI Recruitment 2022: రాత పరీక్షలేకుండా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే నెలకు రూ.78 వేల జీతంతో జాబ్‌..
SBI
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 22, 2022 | 4:17 PM

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచుల్లో.. రెగ్యులర్ ప్రాతిపదికన 55 స్పెషలిస్ట్‌ క్యాడర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ, ఎంబీఏ (ఫైనాన్స్)/పీజీడీబీఏ/పీజీడీబీఎం/ఎంఎంఎస్‌ (ఫైనాన్స్)/సీఏ/సీఎఫ్‌ఏ/ఐసీడబ్ల్యూఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. జులై 30, 2022వ తేదీ నాటికి అభ్యర్ధుల వయసు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈ అర్హతలు కలిగిన వారు డిసెంబర్‌ 12, 2022వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులకు రూ.750లు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. షార్ట్‌లిస్టింగ్ చేసిన వారి జాబితాను వ్యక్తిగత ఈమెయిల్‌కు లేదా ఎస్బీఐ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. విద్యార్హతలు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.63,840ల నుంచి రూ.78,230ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.