AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google: ఈ ఏడాది గూగుల్‌లో ఈమె కోసమే ఎక్కువ మంది వెతికారట.. టాప్‌10లో ఎవరెవరున్నారంటే?

ఈ ఏడాదికి సంబంధించి గూగుల్‌ వెబ్‌సైట్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన సెలబ్రిటీల జాబితాను ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ వెబ్‌సైట్‌ సెలెబ్‌టాట్లర్‌ విడుదల చేసింది. ఈ సంస్థ నివేదిక ప్రకారం ప్రముఖ అమెరికన్‌ నటి అంబర్‌ హార్డ్‌ టాప్‌లో ఉంది. రెండో స్థానంలో హార్డ్‌ మాజీ భర్త, ప్రముఖ హాలీవుడ్‌ నటుడు జానీడెప్ ఉన్నారు.

Google: ఈ ఏడాది గూగుల్‌లో ఈమె కోసమే ఎక్కువ మంది వెతికారట.. టాప్‌10లో ఎవరెవరున్నారంటే?
Amber Heard, Johnny Deep
Basha Shek
|

Updated on: Nov 27, 2022 | 9:09 AM

Share

మన జీవితంలో గూగుల్‌కు ఉన్న ప్రాధాన్యమేంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మనకు తెలియని విషయం, వస్తువు, వ్యక్తి.. ఇలా దేని గురించైనా తెలుసుకోవాలంటే వెంటనే గూగుల్‌ను ఒపెన్‌ చేస్తాం. సమస్త సమచారం ఈ వెబ్‌సైట్‌లో ఉంటుంది. కాగా ఏటా గూగుల్ సెర్చ్ ట్రెండ్స్ పేరిట ఓ నివేదికను విడుదలవుతుంది. గూగుల్‌లో అత్యధిక మంది దేని కోసం వెతుకుతారు? టాప్‌ కీ వర్డ్స్‌ తదితర విషయాలు ఈ నివేదికలో ఉంటాయి. అలా ఈ ఏడాదికి సంబంధించి గూగుల్‌ వెబ్‌సైట్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన సెలబ్రిటీల జాబితాను ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ వెబ్‌సైట్‌ సెలెబ్‌టాట్లర్‌ విడుదల చేసింది. ఈ సంస్థ నివేదిక ప్రకారం ప్రముఖ హాలీవుడ్ నటి అంబర్‌ హార్డ్‌ టాప్‌లో ఉంది. రెండో స్థానంలో హార్డ్‌ మాజీ భర్త, ప్రముఖ హాలీవుడ్‌ నటుడు జానీడెప్ ఉన్నారు. సగటున ప్రతి నెలా 56 లక్షల మంది అండర్ హెర్డ్ గురించి సెర్చ్ చేశారు. అలాగే జానీ డెప్ గురించి సెర్చ్ చేసిన వారి సంఖ్య 55 లక్షలుగా ఉంది.

ఆ తర్వాతి స్థానాల్లో క్వీన్‌ ఎలిజబెత్‌-II, టామ్‌ బ్రాడీ, కిమ్‌ కర్దాషియన్‌, పీట్‌ డేవిడ్సన్‌ ఉన్నారు. ఈ లిస్టులో ఎలాన్‌ మస్క్‌ ఏడో స్థానంలో నిలువగా.. విల్‌స్మిత్‌కు ఎనిమిదో స్థానం దక్కింది. ఈ జాబితాలో భారత్‌ నుంచి ఏ ఒక్కరికీ కూడా చోటు దక్కలేదు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వెతికిన టాప్‌ -100 కీవర్డ్స్‌ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో తొలిస్థానం యూట్యూబ్‌ది కాగా.. తర్వాతి స్థానాల్లో ఫేస్‌బుక్‌, ట్రాన్స్‌లేట్‌, పోర్న్‌హబ్‌, వెదర్‌, అమెజాన్‌, గూగుల్‌ ట్రాన్స్‌లేట్, జీమెయిల్‌, వాట్సాప్‌ వెబ్‌ తదితర పదాలు చోటు సంపాదించాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఏనుగుల దినోత్సవం.. ఇంత తెలివైనవా? అచ్చం మనుషుల్లానే చేస్తాయా
ఏనుగుల దినోత్సవం.. ఇంత తెలివైనవా? అచ్చం మనుషుల్లానే చేస్తాయా
దేవుడి ముందు ప్రార్థిస్తున్నప్పుడు చెడు ఆలోచనలు ఎందుకు వస్తాయి?..
దేవుడి ముందు ప్రార్థిస్తున్నప్పుడు చెడు ఆలోచనలు ఎందుకు వస్తాయి?..
ఎయిర్‌ పోర్టులో అనుమానంగా కనిపించిన ప్రయాణికుడు.. ఆపి చెక్‌ చేయగా
ఎయిర్‌ పోర్టులో అనుమానంగా కనిపించిన ప్రయాణికుడు.. ఆపి చెక్‌ చేయగా
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
2026లో భారత్‌లో అత్యధిక జీతాలు అందించే టాప్ 10 ఉద్యోగాలు..
2026లో భారత్‌లో అత్యధిక జీతాలు అందించే టాప్ 10 ఉద్యోగాలు..
కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటుంది..
కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటుంది..
సామాన్యులకు రైల్వేశాఖ బిగ్ రిలీఫ్..
సామాన్యులకు రైల్వేశాఖ బిగ్ రిలీఫ్..
16 సోమవారాల వ్రతానికి శ్రావణ మాసమే ఎందుకు ప్రత్యేకం? దీని వెనుక..
16 సోమవారాల వ్రతానికి శ్రావణ మాసమే ఎందుకు ప్రత్యేకం? దీని వెనుక..
తెలంగాణ తరహాలో స్టైఫండ్ ఇవ్వాలని జూనియర్ డాక్టర్ల డిమాండ్
తెలంగాణ తరహాలో స్టైఫండ్ ఇవ్వాలని జూనియర్ డాక్టర్ల డిమాండ్
కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు.. మారనున్న రూపురేఖలు..
కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు.. మారనున్న రూపురేఖలు..