AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna: మోక్షజ్ఞ ఎంట్రీ పై మరోసారి బాలయ్య క్లారిటీ..  వెండితెరపై వారసుడు సందడి చేసేది అప్పుడే..

గత కొద్ది రోజులుగా బాలయ్య వారసుడి ఎంట్రీపై వార్తలు వినిపిస్తున్నాయి. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఆయన పరిచయం కానున్నారని ఇప్పటికే టాక్ నడిచింది. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు

Balakrishna: మోక్షజ్ఞ ఎంట్రీ పై మరోసారి బాలయ్య క్లారిటీ..  వెండితెరపై వారసుడు సందడి చేసేది అప్పుడే..
Balakrishna
Rajitha Chanti
|

Updated on: Nov 27, 2022 | 2:57 PM

Share

నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా బాలయ్య వారసుడి ఎంట్రీపై వార్తలు వినిపిస్తున్నాయి. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఆయన పరిచయం కానున్నారని ఇప్పటికే టాక్ నడిచింది. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా వారసుడి ఎంట్రీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బాలకృష్ణ. గోవా ఫిలిం ఫెస్టివల్లో పాల్గొన్న ఆయన.. మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశంపై స్పందించారు. తన కుమారుడిని వచ్చే ఏడాది తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేయనున్నట్లు చెప్పారు. అయితే ఆ చిత్రానికి దర్శకుడు ఎవరనేది మాత్రం చెప్పలేదు. అలాగే తన కుమారుడు బోయపాటి శ్రీను లాంచ్ చేయనున్నారంటూ వస్తోన్న వార్తలపై ఆయన మాట్లాడుతూ.. అంతా దైవేచ్ఛ అని నవ్వి ఊరుకున్నారు. మొత్తానికి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నందమూరి అభిమానులు శుభవార్త చెప్పారు బాలయ్య.

ఈ ఫిలిం ఫెస్టివల్లో ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ అయిన అఖండ చిత్రాన్ని ప్రదర్శించారు. బోయపాటి దర్శకత్వంలో గతేడాది వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. అంతేకాకుండా అఘోరా పాత్రలో ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అయితే ఈ సినిమా సిక్వెల్ రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయని ప్రశ్నించగా.. అఖండ 2 తప్పకుండా ఉంటుందన్నారు.

ఇవి కూడా చదవండి

ఇప్పటికే సబ్జెక్ట్ కూడా సిద్ధం చేశామని.. అధికారికంగా ప్రకటించడం మాత్రమే మిగిలిందన్నారు. సమయం చూసి ప్రకటిస్తామని చెప్పారు. ఈ సినిమాను గోవా ఫిలిం ఫెస్టివల్లో ఈ సినిమాను ప్రదర్శించగా.. డైరెక్టర్ బోయపాటి శ్రీను, బాలయ్య, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి గోవాలో సందడి చేశారు. ప్రస్తుతం బాలయ్య డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహ రెడ్డి సినిమా చేస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి