Mahesh Babu: కృష్ణ దశ దిన కర్మలో మహేష్ ఎమోషనల్.. ఆ విషయంలో ఎప్పుడూ రుణపడి ఉంటానంటూ..

ఆదివారం (నవంబర్ 27)న ఎన్ కన్వెన్షన్ దగ్గర కృష్ణ దశ దిన కర్మ నిర్వహిస్తున్నారు ఘట్టమనేని కుటుంబసభ్యులు. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులుతోపాటు.. అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అలాగే 27 సంవత్సరాల వయసులో కృష్ణ ఎలా ఉన్నారో అచ్చం అలాంటి విగ్రహాన్ని ఎన్ కన్వెన్షన్ దగ్గర ఏర్పాటు చేశారు.

Mahesh Babu: కృష్ణ దశ దిన కర్మలో మహేష్ ఎమోషనల్.. ఆ విషయంలో ఎప్పుడూ రుణపడి ఉంటానంటూ..
Mahesh Babu, Krishna
Follow us

|

Updated on: Nov 27, 2022 | 3:30 PM

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ మరణాన్ని అటు ఘట్టమనేని ఫ్యామిలీ.. ఇటు అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. భౌతికంగా ఈ లోకానికి దూరమయినస తమ అభిమాన హీరో జ్ఞాపకాలను తలుచుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు అభిమానులు. ఇక ఇంట్లో వరుస విషాదాలతో మహేష్ పూర్తిగా కుంగిపోయారు. ఏడాది ప్రారంభంలోనే అన్నయ్యను.. రెండు నెలల క్రితం తల్లి ఇందిరా దేవిని.. ఇక ఇప్పుడు తండ్రి కృష్ణను కోల్పోవడంతో మహేష్‏ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఆదివారం (నవంబర్ 27)న ఎన్ కన్వెన్షన్ దగ్గర కృష్ణ దశ దిన కర్మ నిర్వహిస్తున్నారు ఘట్టమనేని కుటుంబసభ్యులు. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులుతోపాటు.. అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అలాగే 27 సంవత్సరాల వయసులో కృష్ణ ఎలా ఉన్నారో అచ్చం అలాంటి విగ్రహాన్ని ఎన్ కన్వెన్షన్ దగ్గర ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.

” నాన్న నాకు ఎన్నో ఇచ్చారు. వాటిలో గొప్పది.. మీ అభిమానం.. అందుకు ఆయనకు నేను రుణపడి ఉంటాను. నాన్నగారు ఎప్పుడూ నా గుండెల్లో ఉంటారు. మీ గుండెల్లోనూ ఉంటారు. ఆయన ఎప్పుడూ మనమధ్యే ఉంటారు. మీ అభిమానం, ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను” అంటూ ఎమోషనల్ అయ్యారు మహేష్. ఇక కృష్ణ మరణం అనంతరం సోషల్ మీడియాలో మహేష్ చేసిన పోస్ట్ అందరి హృదయాలను కదిలించింది.

ఇవి కూడా చదవండి

ఇటీవల తీవ్ర అనారోగ్యంతో కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరిన సూపర్ స్టార్.. చికిత్స పొందుతూ నవంబర్ 15న తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఫిల్మ్‌నగర్‌లోని మహాప్ర్థానంలో తెలంగాణ ప్రభుత్వం తెలుగు సినీ కెరటం కృష్ణ అంత్యక్రియలను నిర్వహించింది. దాదాపు 350 కి పైగా సినిమాల్లో నటించి తెలుగు వారి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు కృష్ణ. ఆయన మరణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు తీరని శోకం మిగిల్చింది.

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో