Pavitra Lokesh: పవిత్ర లోకేష్ ఫిర్యాదుతో యాక్షన్‌లోకి దిగిన పోలీసులు.. 15 యూట్యూబ్ ఛానళ్లకి నోటీసులు
ప్రైవసీకి భంగం వాటిల్లేలా కొన్ని యూట్యూబ్ ఛానల్స్, వెబ్‌సైట్స్ అసత్య ప్రచారం చేస్తున్నాయని.. మార్ఫింగ్ ఫోటోలతో తమను ఇబ్బంది పెడుతున్నారని పవిత్రా లోకేశ్ కంప్లైంట్ చేశారు.
సోషల్ మీడియాలో తనపై ట్రోలింగ్ ఆపాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు నటి పవిత్ర లోకేష్. తనను, నటుడు నరేశ్‌ను వేధిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై ట్రోల్ చేస్తున్న ఛానల్స్, వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.. మార్ఫింగ్ ఫోటోలు, అసభ్యపదాలతో వేధిస్తున్నారని కంప్లైంట్ చేశారు. ఉద్దేశ పూర్వక రాతలను ఆపేలా చర్యలు తీసుకోవాలంటూ పవిత్ర లోకేశ్ చేసిన ఫిర్యాదుతో చర్యలు చేపట్టారు పోలీసులు. దీంతో యాక్షన్ స్టార్ట్ చేసిన పోలీసులు.. ఆదివారం 15 యూట్యూబ్ ఛానళ్లకు నోటీసులు జారీ చేశారు. ఆమె ఫిర్యాదులో పేర్కొన్న వెబ్‌సైట్స్‌కి కూడా నోటీసులు పంపారు. 3 రోజుల్లో విచారణకు హాజరవ్వాలని సూచించారు.
పవిత్ర, నరేష్‌లు.. ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. ప్రస్తుతం సహజీవనం చేస్తున్నారు. దీనిపై అధికారికంగా స్పందించనప్పటికీ.. చాలా రోజులుగా కలిసే ఉంటున్నారు. నరేష్, పవిత్ర.. సోషల్ మీడియాలో వీళ్లిద్దరిపై ట్రోల్స్ రంకెలేస్తున్నాయి. మైసూర్‌లోని ఓ హోటల్‌లో ఉన్న వీళ్లను..నరేష్ మూడో భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో.. వీళ్ల రిలేషన్ గురించి లోకానికి తెలిసింది.. అప్పటి నుంచీ..నరేష్ పవిత్రలకు సోషల్‌మీడియా ఉప్పెనలా ఎగసిపడింది. ఉన్నది.. లేనిది రాస్తూ నిత్యం ఈ కపుల్‌ను ట్రెండింగ్‌లో ఉంచుతున్నారు. దీంతో హర్టయిన పవిత్ర సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియల సమయంలోనూ ఇద్దరూ పక్కపక్కనే ఉన్నారు. ఈ సందర్భంలో..కృష్ణను చివరిసారిగా చూడటానికి వచ్చిన పలువురు.. వీళ్లిద్దరి ప్రవర్తన చూసి.. కాస్త అసహనంగా ఫీలయినట్లు కూడా టాక్ వచ్చింది. కృష్ణ అంత్యక్రియల సమయంలో..వారి బిహేవియర్ మరీ ఎబ్బెట్టుగా ఉందని.. సోషల్ మీడియా దునియా మొత్తం దున్నేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..