AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Law Admissions: ముగిసిన తెలంగాణ లాసెట్‌ సీట్ల కేటాయింపు ప్రక్రియ.. తుది విడతలో 5,747 మందికి సీట్లు..

తెలంగాణ లాసెట్‌-2022 సీట్ల కేటాయింపు ఫలితాలను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. కౌన్సెలింగ్‌కు హాజరైన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. ఈ ఏడాది జులై 21, 22 తేదీల్లో నిర్వహించిన లాసెట్‌ ప్రవేశ పరీక్షల్లో..

TS Law Admissions: ముగిసిన తెలంగాణ లాసెట్‌ సీట్ల కేటాయింపు ప్రక్రియ.. తుది విడతలో 5,747 మందికి సీట్లు..
TS LAWCET 2022 Counselling
Srilakshmi C
|

Updated on: Nov 27, 2022 | 3:37 PM

Share

తెలంగాణ లాసెట్‌-2022 సీట్ల కేటాయింపు ఫలితాలను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. కౌన్సెలింగ్‌కు హాజరైన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. ఈ ఏడాది జులై 21, 22 తేదీల్లో నిర్వహించిన లాసెట్‌ ప్రవేశ పరీక్షల్లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా కౌన్సెలింగ్‌ నిర్వహించారు. తొలి విడత కౌన్సెలింగ్‌లో 5,747 మంది అభ్యర్థులకు సీట్లు దక్కాయి. కన్వీనర్‌ కోటా కింద మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ, అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం సీట్లు 6,724 ఉండగా, వీటిల్లో 85.47 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. దాదాపు12,301 మంది వెబ్‌ ఆప్షన్లు ఇవ్వగా వారిలో 5,747 మందికే సీట్లు దక్కినట్లు కన్వీనర్‌ ప్రొఫెసర్‌ పి రమేష్‌బాబు తెలిపారు.

ఆయా లా కాలేజీల్లో సీట్లు పొందిన విద్యార్ధులు సంబంధిత డాక్యుమెంట్లతో నవంబర్‌ 28 నుంచి డిసెంబరు 3తేదీలలోపు రిపోర్టింగ్‌ చేయవల్సి ఉంటుంది. ప్రత్యేక రిజర్వేషన్‌ ఉన్న విద్యార్థులకు సీట్లింకా కేటాయించలేదు. వాటితో కూడా కలిపితే 90 శాతం వరకు సీట్లు భర్తా అవుతాయని కన్వీనర్ తెలిపారు. గతేడాదితో పోల్చితే ఈసారి లా సీట్లకు పోటీ భారీగా పెరిగిందని ఆయన అన్నారు. రాష్ట్ర గురుకులాల్లో అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులున్నప్పటికీ.. కొన్ని కారణల రిత్యా వాటిలో ఎక్కువ సీట్లు భర్తీ కాకుండా మిగిలిపోయినట్లు కన్వీనర్ తెలిపారు. కాగా లాసెట్‌ ప్రవేశ పరీక్షలు ప్రతీ యేటా ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షలో సాధించిన ర్యాంకు ఆధారంగా మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..