TSPSC: నిరుద్యోగులకు గమనిక! తెలంగాణ గ్రూప్-4 రిక్రూట్‌మెంట్‌లో ఏయే శాఖ‌ల్లో ఎన్ని పోస్టులున్నాయో తెలుసా..

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 9,168 గ్రూప్‌-4 ఉద్యోగాల భర్తీకి త్వరలోనే అధికారిక నోటిఫికేషన్‌ విడుదలవ్వనుంది. ఆయా శాఖల్లో ఏయే పోస్టులున్నాయంటే..

TSPSC: నిరుద్యోగులకు గమనిక! తెలంగాణ గ్రూప్-4 రిక్రూట్‌మెంట్‌లో ఏయే శాఖ‌ల్లో ఎన్ని పోస్టులున్నాయో తెలుసా..
Telangana
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 27, 2022 | 3:08 PM

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 9,168 గ్రూప్‌-4 ఉద్యోగాల భర్తీకి త్వరలోనే అధికారిక నోటిఫికేషన్‌ విడుదలవ్వనుంది. ఈమేరకు ఇప్పటికే డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేసేందుకు అనుమతిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు సైతం జారీ చేసింది. దాదాపు 25 శాఖల్లోని 91 విభాగాల్లో ఖాళీగా ఉన్న 6,859 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు, పురపాలక శాఖలో 1,862 వార్డు ఆఫీసర్‌ పోస్టులు, ఆర్థికశాఖలో జూనియర్‌ అకౌంటెంట్‌ పోస్టులు 191, పురపాలకశాఖలో 429 జూనియర్‌ అకౌంటెంట్‌ పోస్టులు, ఆడిట్‌శాఖలో 18 మంది జూనియర్‌ ఆడిటర్‌ పోస్టుల నియామకాలకు ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. ఈ ఉద్యోగాలన్నింటినీ టీఎస్పీయస్సీ నిర్వహించే నియామక పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నారు.

జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల వివరాలు ఇవే..

  • రెవెన్యూలో ఖాళీలు: 2,077
  • పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధిలో ఖాళీలు: 1,245
  • ఉన్నత విద్యలో ఖాళీలు: 742
  • పురపాలన, పట్టణాభివృద్ధిలో ఖాళీలు: 601
  • ఎస్సీ సంక్షేమంలో ఖాళీలు: 474
  • వైద్య, ఆరోగ్యంలో ఖాళీలు: 338
  • బీసీ సంక్షేమంలో ఖాళీలు: 307
  • గిరిజన సంక్షేమంలో ఖాళీలు: 221
  • మైనార్టీ సంక్షేమంలో ఖాళీలు: 191
  • హోం శాఖలో ఖాళీలు: 133
  • కార్మిక, ఉపాధిశిక్షణలో ఖాళీలు: 128
  • పాఠశాల విద్యలో ఖాళీలు: 97
  • పౌరసరఫరాలులో ఖాళీలు: 72
  • నీటిపారుదలలో ఖాళీలు: 51
  • ఆర్థిక శాఖలో ఖాళీలు: 46
  • వ్యవసాయంలో ఖాళీలు: 44
  • ఆడవులు, పర్యావరణంలో ఖాళీలు: 23
  • రవాణా, ఆర్ అండ్‌ బిలో ఖాళీలు: 20
  • మహిళ, శిశు సంక్షేమంలో ఖాళీలు: 18
  • యువజన, పర్యాటక, సాంస్కృతికలో ఖాళీలు: 13
  • పరిశ్రమలులో ఖాళీలు: 7
  • సాధారణ పరిపాలనలో ఖాళీలు: 5
  • విద్యుత్‌ లో ఖాళీలు: 2
  • ప్రణాళిక శాఖలో ఖాళీలు: 2
  • పశుసంవర్దకలో ఖాళీలు: 2

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ప్రియుడే కావాలన్న భార్య.. వారించినా వినకపోవడంతో భర్త ఏం చేశాడంటే
ప్రియుడే కావాలన్న భార్య.. వారించినా వినకపోవడంతో భర్త ఏం చేశాడంటే
పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!