TSLPRB Updates: తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్.. ఈవేంట్స్ డేట్ వచ్చేసింది..
TSLPRB - PMT PET Test: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు టీఎస్ఎల్‌పీఆర్‌బీ నుంచి న్యూస్ రానే వచ్చింది. డిసెంబర్ 8వ తేదీ నుంచి..
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు టీఎస్ఎల్‌పీఆర్‌బీ నుంచి న్యూస్ రానే వచ్చింది. డిసెంబర్ 8వ తేదీ నుంచి ఎస్ఐ, కానిస్టేబుల్ శారీరక పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక బోర్డ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్ 8వ తేదీ నుంచి PMT, PET టెస్టులు నిర్వహించనున్నట్లు టీఎస్ఎల్‌పీఆర్‌బి ప్రకటించింది. అభ్యర్థులు నవంబర్ 29వ తేదీన ఉదయం 8 గంటల నుంచి డిసెంబర్ 3వ తేదీన అర్థరాత్రి 12 గంటల వరకు అడ్మిట్ కార్డ్స్ డౌన్‌లోడ్ చోటు చేసుకోవచ్చునని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 11 కేంద్రాలు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ లలో ఈ ఈవెంట్స్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 8న మొదలయ్యే ఈ ఈవెంట్స్.. 23 నుంచి 25 రెజుల్లో పూర్తి చేస్తామని ప్రకటించారు. పూర్తి వివరాలను https://www.tslprb.in/ అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు. హాల్‌టికెట్ డౌన్‌లోడ్‌లో ఏవైనా సమస్యలుంటే.. support@tslprb.in కి మెయిల్ చేయడం గానీ, 93937 11110, 93910 05006 నెంబర్లకు కాల్ చేసి గానీ క్లారిఫై చేసుకోవచ్చు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..