AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aha-Dance Ikon: డాన్స్ మెగా ఈవెంట్స్ కా బాప్.. ఆహా డాన్స్ ఐకాన్ విన్నర్ ఎంత గెలిచాడంటే..

కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకుల కోసం ఫుడ్, డాన్స్, ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్‌ను సరికొత్తగా అందించడానికి సిద్ధమైంది ఆహా. కొత్తదనంతో డాన్స్ ఐకాన్ షోతో ఆడియన్స్

Aha-Dance Ikon: డాన్స్ మెగా ఈవెంట్స్ కా బాప్.. ఆహా డాన్స్ ఐకాన్ విన్నర్ ఎంత గెలిచాడంటే..
Dance Icon
Rajitha Chanti
|

Updated on: Nov 28, 2022 | 3:00 PM

Share

తెలుగు వారి హృదయాల్లో సుస్థిర స్థానాన్ని దక్కించుకున్న అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఓటీటీ మాధ్యమం ఆహా. ప్రతి వారం ఆడియెన్స్‌ని సూపర్బ్ ఎంటర్‌టైనింగ్ షోస్‌తో అలరిస్తోంది. ఓవైపు నందమూరి నటసింహం బాలకృష్ణతో టాక్ షో నిర్వహిస్తూ.. ఓటీటీ ప్రియులను అలరిస్తున్న ఆహా.. మరో వైపు డాన్స్ ఐకాన్ షోతో ప్రేక్షకులను మరింత ఎంటర్టైన్ చేస్తున్నారు. కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకుల కోసం ఫుడ్, డాన్స్, ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్‌ను సరికొత్తగా అందించడానికి సిద్ధమైంది ఆహా. కొత్తదనంతో డాన్స్ ఐకాన్ షోతో ఆడియన్స్ మనసులు దొచుకున్న ఆహా.. గ్రాండ్ ఫినాలే అట్టహాసంగా జరిగింది. 13 వారాల పాటు ఎంతో సరదాగా సాగిన ఈ షో విన్నర్స్‏గా అసిఫ్, రాజు నిలిచారు.

ఎట్టకేలకు 13 వారాలు శ్రమించి న్యాయనిర్ణేతలను మెప్పించారు అసిఫ్.. అతని కొరియోగ్రాఫర్ రాజు. విజేతలుగా నిలిచిన అసిఫ్ రూ. 20 లక్షల నగదుతోపాటు.. విన్నర్ ట్రోఫిని సొంతం చేసుకున్నారు. అలాగే రాజు.. తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన స్టార్ హీరోకి కొరియోగ్రఫి చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు.

ఈ షో ఫినాలేలో అల్లు అరవింద్‏తోపాటు, మైత్రీ రవిశంకర్, ఎస్ వీసీసీ బాపినీడు, సితార నాగవంశి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొరియోగ్రాఫర్ రాజు మాట్లాడుతూ.. డాన్స్ ఐకాన్ విజేతలుగా నిలవడం మరచిపోలేని జర్నీ. ఈ జర్నీలో భాగమైన నా కంటెస్టెంట్ రాజుకు థాంక్స్. నాతోటి కొరియోగ్రాఫర్స్ వారి ప్రదర్శనతో నన్ను ఛాలెంజ్ చేస్తూ వచ్చారు. అలాగే ప్రతి వారం జడ్జీలు కూడా నాలో స్పూర్తి నింపుతూ వచ్చారు. అందువల్లనే విజేతగా ఈరోజు ఇక్కడ నిలిచాం. షోను విజయవంతం చేసిన ప్రేక్షకులకు, ఆహా యాజమాన్యానికి థాంక్స్. నా కలం నిజం చేశారు. ” అని అన్నారు.

ఇవి కూడా చదవండి