Ranjithame Song: రంజితమే తెలుగు వెర్షన్ సాంగ్ వచ్చేసింది.. సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న పాట విన్నారా ?..

ఇక ఇప్పటికే విడుదలైన రంజితమే సాంగ్ యూట్యూబ్ లో సెన్సెషనల్ క్రియేట్ చేసింది. విడుదలైన 25 రోజుల్లోనే 7 కోట్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుని యూట్యూబ్ ట్రెండింగ్‏లో దూసుకెళ్తుంది. తాజాగా ఈపాట తెలుగు వెర్షన్ రిలీజ్ చేశారు మేకర్స్.

Ranjithame Song: రంజితమే తెలుగు వెర్షన్ సాంగ్ వచ్చేసింది.. సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న పాట విన్నారా ?..
Ranjathame Song
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 30, 2022 | 2:45 PM

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ కధానాయకుడిగా నేరుగా తెలుగులో చేస్తోన్న సినిమా వారుసుడు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పీవీపీ బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి బిగ్గెస్ట్ ఎట్రాక్షన్స్ లో ఒకటిగా రాబోతున్న ఈ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌ టైనర్‌లో విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. ఇక ఇప్పటికే విడుదలైన రంజితమే సాంగ్ యూట్యూబ్ లో సెన్సెషనల్ క్రియేట్ చేసింది. విడుదలైన 25 రోజుల్లోనే 7 కోట్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుని యూట్యూబ్ ట్రెండింగ్‏లో దూసుకెళ్తుంది. తాజాగా ఈపాట తెలుగు వెర్షన్ రిలీజ్ చేశారు మేకర్స్.

రంజితమే అంటూ సాగే ఈ పాటకు ప్రముఖ సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించారు. తమిళంలో విజయ్ పాడిన ఈ పాటను తెలుగులో అనురాగ్ కులకర్ణి ఎంఎం.మానసి ఆలపించారు. సూపర్ ఫామ్‌ లో ఉన్న ఎస్ థమన్ ఈ పాట కోసం ఫుట్‌ట్యాపింగ్ నంబర్‌ ను స్కోర్ చేశారు. ఇందులో విజయ్, రష్మికల జోడి లవ్లీగా కనిపించింది.

విజయ్‌, జానీ మాస్టర్‌ల కాంబినేషన్‌ సూపర్‌ హిట్‌. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన స్టెప్పులకు విజయ్ డ్యాన్స్ చేయడం చూడటం ఎప్పుడూ ట్రీట్‌ గా ఉంటుంది. డ్యాన్స్‌లు ట్రెండీగా, గ్రేస్ ఫుల్ గా ఉన్నాయి. ఈ పాటలో రష్మిక మందన్న స్టన్నింగ్ గా కనిపించింది. సెట్టింగ్, బ్యాక్‌డ్రాప్‌లు వైబ్రెటింగా వున్నాయి. మొత్తంమీద ఇది మళ్ళీ మళ్ళీ చూడాలనుకునే డ్యాన్స్ ట్రాక్. వైరల్ అవ్వడానికి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఈ పాటలో వున్నాయి. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లితో పాటు హరి, అహిషోర్‌ సాల్మన్‌ కథ, స్క్రీన్ ప్లేను అందించారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ