Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: రష్మికను బ్యాన్ చేయనున్న కన్నడ ఇండస్ట్రీ ?.. వారికే నష్టమంటూ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..

రష్మిక ను కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేయనున్నట్లుగా కూడా టాక్ వినిపించింది. తాజా గా ఈ వార్తలపై స్పందించారు డైరెక్టర్ నాగశేఖర్. తన తదుపరి చిత్రం గుర్తుందా శీతాకాలం

Rashmika Mandanna: రష్మికను బ్యాన్ చేయనున్న కన్నడ ఇండస్ట్రీ ?.. వారికే నష్టమంటూ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..
Rashmika Mandanna
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 30, 2022 | 3:44 PM

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో రష్మిక వర్సెస్ రిషబ్ శెట్టి వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక.. తన మొదటి సినిమా గురించి మాట్లాడుతూ.. తన అందం, టాలెంట్ చూసి ఆఫర్ ఇచ్చారంటూ ప్రొడక్షన్ హౌస్ పేరు చెప్పకుండా వెళ్లతో చూపించిన సంగతి తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే ఓ బాలీవుడ్ యాంకర్ ఆడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ.. రష్మికకు రివర్స్ కౌంటర్ ఇచ్చారు రిషబ్ శెట్టి. వేళ్లతో సైగలు చేసే హీరోయిన్లతో ఇకపై తాను పనిచేయాలనుకోవడం లేదంటూ పరోక్షంగా రష్మిక గట్టిగానే ఆన్సర్ ఇచ్చారు. అయితే వీరిద్దరి మధ్య నెలకొన్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. దీంతో నేషనల్ క్రష్ తీరుపై కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆమెను ట్రోల్ చేశారు. ఈ క్రమంలోనే రష్మిక ను కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేయనున్నట్లుగా కూడా టాక్ వినిపించింది. తాజా గా ఈ వార్తలపై స్పందించారు డైరెక్టర్ నాగశేఖర్. తన తదుపరి చిత్రం గుర్తుందా శీతాకాలం ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ వివాదం పై కామెంట్స్ చేశారు.

” ఒకరి నుంచి కృతజ్ఞత కోరుకోవడం మనదే తప్పు. సంజు వెడ్స్ గీత చిత్రాన్ని తెరకెక్కించినప్పుడు అందులో కొంతమంది నటీనటులకు అవకాశం ఇచ్చాను. ఇప్పుడు వాళ్లు కెరీర్ లో పెద్ద స్టార్స్ అయ్యారు. నా సినిమా తర్వాత వాళ్లు నన్ను గుర్తు పెట్టుకుంటారా ? లేదా ? అనేది పూర్తిగా వాళ్ల వ్యక్తిగతం. నేను దాన్ని పట్టించుకోను. నా తదుపరి సినిమాపైనే ఫోకస్ పెడతా. ఎదుటి వాళ్ల నుంచి కృతజ్ఞతాభావాన్ని కోరుకున్నప్పుడే మనం ఎక్కడో ఓచోట బాధకు లోనవుతాం” అన్నారు.

ఇవి కూడా చదవండి

అలాగే రష్మికను కన్నడ పరిశ్రమ బ్యాన్ విధించనుందంటూ వస్తున్న వార్తలపై స్పందిస్తూ… దాని గురించి నాకు తెలియదు. ఒకవేళ అలా చేస్తే అది ఆ పరిశ్రమకే నష్టం. ఈ విషయాన్ని నేను సపోర్ట్ చేయను అని అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరలవుతున్నాయి.

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..