AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Geetu Royal: చిత్తూరు చిరుత చేసిన పనికి.. నెటిజన్స్ రియాక్షన్స్ నెక్స్ట్ లెవల్

అలా గీతూ కావాల్సినంత ఫుట్టేజ్ ఇచ్చింది. బిగ్ బాస్ చెప్పింది కూడా పట్టించుకోకుండా నా స్ట్రాటజీ, నా గేమ్, నా ఇష్టం అంటూ ఆడింది గీతూ.. ఇక  ఈ చిన్నది  ఎలిమినేట్ అయిన తర్వాత బోరున ఏడ్చింది.

Geetu Royal: చిత్తూరు చిరుత చేసిన పనికి.. నెటిజన్స్ రియాక్షన్స్ నెక్స్ట్ లెవల్
Geetu Royal
Rajeev Rayala
|

Updated on: Dec 01, 2022 | 12:50 PM

Share

బిగ్ బాస్ సీజన్ 6లో అంతో ఇంతో ఆకట్టుకుంది ఎవరు అంటే గలాటా గీతూ అనే చెప్పాలి.. ప్రేక్షకులకు కాస్త ఇరిటేషన్ తెప్పించినా.. ఈ రోజు ఏం చేస్తుందో అంటూ ఆసక్తితో చూశారు ప్రేక్షకులు. అలా గీతూ కావాల్సినంత ఫుట్టేజ్ ఇచ్చింది. బిగ్ బాస్ చెప్పింది కూడా పట్టించుకోకుండా నా స్ట్రాటజీ, నా గేమ్, నా ఇష్టం అంటూ ఆడింది గీతూ.. ఇక  ఈ చిన్నది  ఎలిమినేట్ అయిన తర్వాత బోరున ఏడ్చింది. హౌస్ లో ఉన్నప్పుడు నన్ను ఏడిపించు బిగ్ బాస్ అని సవాల్ విసిరిన గీతూ.. ఇప్పుడు బిగ్ బాస్ ఎపిసోడ్స్ చూస్తూ రోజు ఏడుస్తోంది. అంతే కాదు ఆ వీడియోలు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి.  కప్పు కొట్టేది నేనే గెలిచేది నేనే అని బీరాలు పోయిన గీతూ టాప్ 5లో అయినా ఉంటుందని అంతా అనుకున్నారు కానీ ప్రేక్షకులు ఆమె ఎలిమినేట్ చేశారు.

బిగ్ బాస్  నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంతవరకు ఇంటర్వ్యూ ల్లో కనిపించని గీతూ చాలా రోజుల తర్వాత బయటకు వచ్చింది. బిగ్ బాస్ తర్వాత డిప్రషన్ లో కి వెళ్లిందట.. అందుకే బయట కనిపించలేదట.. మొన్నీమద్యే నాగార్జునను కలిసింది గీతూ.. అక్కడ దిగిన ఫోటోను  సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఇవి కూడా చదవండి

ఇక బయటకు వచ్చిన గీతూ చేసిన పని ఏంటో తెలుసా.. చిత్తూరు చిరుత అని చెప్పుకున్న గీతూ తాజాగా చిరుత ట్యాటూ వేయించుకుంది. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన గీతూ.. 20 రోజుల తరువాత బయటకు వచ్చాను. ఓ పని మీద బయటకు వచ్చాను.. అది ఎక్కడికి అంటే.. హెయిర్ కలర్ కోసం.. కాలిపై టాటూ కోసం. నా లైఫ్‌లో చేయని పనులు చేస్తున్నా.. నా కాలికి సైలెన్సర్ కాలిన మచ్చ ఉంది.. ఆ మచ్చని.. చిరుత మచ్చలతో కవర్ చేద్దాం అని ఈ చిరుత చారలు టాటూగా వేయించుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ న్యూస్ కోసం..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!