AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telugu Cinema : సినిమా రికార్డ్‌ చేస్తే.. మూడేళ్ల జైలు శిక్ష.. పైరసీపై ఉక్కుపాదం.. స్పెషల్ యాంటీ పైరసీ యూనిట్‌ ప్రారంభం..

తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) సినిమా పైరసీని అరికట్టేందుకు కొత్త చర్యలు ప్రారంభించింది. థియేటర్లలో సినిమా ప్రదర్శనకు ముందు తప్పనిసరిగా చూపేలా పైరసీ నిరోధక డిస్క్లైమర్ ను ప్రవేశపెట్టారు. పైరసీ కేసుల దర్యాప్తును సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రామాణిక ఆపరేటింగ్ విధానం (SOP) అమల్లోకి వచ్చింది. పైరసీ కంటెంట్ ప్రధానంగా, పోస్ట్ ప్రొడక్షన్ / డిజిటల్ సర్వీస్ స్థాయిలో HD లీక్‌లు, థియేటర్లలో క్యామ్‌కార్డింగ్ ద్వారా బయటకు వస్తుందని అధికారులు తెలిపారు.

Telugu Cinema : సినిమా రికార్డ్‌ చేస్తే.. మూడేళ్ల జైలు శిక్ష.. పైరసీపై ఉక్కుపాదం.. స్పెషల్ యాంటీ పైరసీ యూనిట్‌ ప్రారంభం..
Telugu Cinema
Rajitha Chanti
|

Updated on: Mar 17, 2026 | 7:05 AM

Share

తెలుగు తెరకు తెగులు పట్టినట్లు పట్టి, ప్రొడ్యూసర్స్‌ గుండెల్లో గుబులు రేపుతున్న పైరసీ రక్కసిని అంతం చేయడానికి TGCSB పంతం పట్టింది. దీనికోసం తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో… ఓ కొత్త ఫార్ములాతో ముందడుగు వేసింది. దాని ఇంప్లిమెంట్‌తో, టాలీవుడ్‌ని పట్టి పీడిస్తున్న పైరసీకి ఇక ఫుల్‌స్టాప్‌ పడనుందా? చెదలు తొలిచేసినట్లు…టాలీవుడ్‌ను లోపలనుంచి తొలిచేస్తోంది పైరసీ భూతం. టాలీవుడ్‌తో పాటు అటు బాలీవుడ్‌, కోలీవుడ్‌, మాలీవుడ్‌, శాండల్‌వుడ్‌..ఇలా దేశంలోని అన్ని సినీ పరిశ్రమల పాలిట మహమ్మారిలా తయారైంది పైరసీ. దీన్ని ఎన్ని రకాలుగా అణచివేసినా, మళ్లీ మళ్లీ తలెత్తుతోంది. పైరసీ కారణంగా తెలుగు సినిమా పరిశ్రమకు ఏటా సుమారు రూ.3,700 కోట్ల నష్టం జరుగుతుండగా, భారతీయ సినిమా పరిశ్రమ మొత్తానికి రూ. 22,400 కోట్ల నష్టం చేకూరుతోందని, సినీ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ దశలో కంటెంట్ లీక్ అవడం, డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల లోపాలు, థియేటర్లలో క్యామ్‌కార్డింగ్ వంటి అంశాలు పైరసీకి ప్రధాన కారణాలుగా అధికారులు గుర్తించారు.

ఎక్కువమంది చదివినవి : Jabardasth Naresh: నెలకు 13 ఈవెంట్స్ చేస్తా.. ఒక్కో ఈవెంట్‏కు ఎంత తీసుకుంటానంటే.. జబర్దస్త్ నరేష్..

దీంతో పైరసీ గ్యాంగులపై ఉక్కుపాదం మోపేందుకు… తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో యాంటీ పైరసీ యూనిట్‌ను ప్రారంభించారు. పైరసీని కట్టడి చేయడానికి సరికొత్త చర్యలకు TGCSB శ్రీకారం చుట్టింది. దానిలో భాగంగా థియేటర్లలో సినిమా ప్రదర్శనకు ముందు, పైరసీ నిరోధక డిస్‌క్లెయిమర్‌ను తప్పకుండా ప్రదర్శించాలి. ప్రేక్షకుల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక థియేటర్లలో సినిమాలను రికార్డ్ చేస్తే…3 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా 3 లక్షల రూపాయల భారీ జరిమానా విధిస్తారని ఆ డిస్‌క్లెయిమర్ హెచ్చరిస్తుంది. ఇక పైరసీ కేసులను సమర్థవంతంగా దర్యాప్తు చేసేందుకు స్టాండర్డ్‌ ఆపరేటింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. కొత్త SOPలో భాగంగా FIR నమోదు, డిజిటల్ ఆధారాల సేకరణ, ఫోరెన్సిక్ పరీక్షలు, వాటర్‌మార్కింగ్ ద్వారా లీక్ జరిగిన థియేటర్‌ను గుర్తించడం వంటి చర్యలు తీసుకుంటారు. పైరసీ URLలను బ్లాక్ చేయడానికి డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లతో అధికారులు సమన్వయం చేసుకుంటారు. ఇక పైరసీ మూలాలను గుర్తించేందుకు సినిమా విడుదలైన తర్వాత కనీసం ఒక నెల పాటు CCTV ఫుటేజ్‌ను భద్రపరచాలని థియేటర్ల యజమానులకు పోలీస్‌ అధికారులు సూచించారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లును సుడిగాలి సుధీర్‏కు అమ్మేశా.. టాలీవుడ్ నటుడు..

తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దగ్గుబాటి సురేష్ బాబు… సంయుక్తంగా ఈ యాంటీ పైరసీ డిస్‌క్లెమర్‌ను, ప్రామాణిక ఆపరేటింగ్‌ విధానాన్ని ప్రారంభించారు. ఈ చర్యలతో పైరసీకి ఫుల్‌స్టాప్‌ పడుతుందని, సినిమా లీకులు తగ్గిపోతాయని ఇండస్ట్రీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఆమెకు 15.. అతడికి 24.. పదేళ్లుగా సీక్రెట్ లవ్.. కట్ చేస్తే.. భార్యభర్తలుగా ఒక్కటైన హీరోహీరోయిన్..

ఎక్కువమంది చదివినవి : Appa Rao: ఆ సినిమా సమయంలో చేసిన పని.. నా ఫేస్ మొత్తం బ్లాక్ అయ్యింది.. జబర్దస్త్ అప్పారావు..

Follow Us
పేద విద్యార్ధులు యేటా రూ.48 వేలు పొందే ఛాన్స్.. దరఖాస్తు లింక్
పేద విద్యార్ధులు యేటా రూ.48 వేలు పొందే ఛాన్స్.. దరఖాస్తు లింక్
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో