AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: స్టార్ హీరోల నయా లుక్స్.. మాస్ అవతారాల్లో మెప్పిస్తానంటున్న హీరోస్..

కమర్షియల్ సినిమా హీరో అంటే పొకిరి, దేశముదురు, ఇడియట్‌ లా కూడా ఉండొచ్చని.. అలాంటి రోల్స్‌లోనూ హీరోలను ఆడియన్స్‌ యాక్సెప్ట్ చేస్తారని ప్రూవ్ చేశారు పూరి. ఈ ట్రెండ్ మరింతగా మారిపోయింది. కేజీఎఫ్ లాంటి సక్సెస్‌ల తరువాత హీరో క్యారెక్టర్‌ను

Tollywood: స్టార్ హీరోల నయా లుక్స్.. మాస్ అవతారాల్లో మెప్పిస్తానంటున్న హీరోస్..
Prabhas, Ntr
Rajitha Chanti
|

Updated on: Dec 01, 2022 | 3:02 PM

Share

గతంలో హీరో అంటే శ్రీరాముడి లాంటి వాడు అన్నట్టుగా చూపించేవారు. కానీ ప్రజెంట్‌ కమర్షియల్ సినిమా ఫార్మాట్‌ మారిపోయింది. హీరో అంటే మంచివాడే కావాల్సిన అవసరం లేదు. తాను అనుకున్నది సాధించే గట్స్ ఉన్నవాడైతే చాలంటున్నారు మేకర్స్‌. అందుకే.. రీసెంట్‌ టైమ్స్‌ టాప్ మూవీస్ అన్నింటిలో హీరోలు నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లోనే కనిపిస్తున్నారు. హీరోయిజం డెఫినియేషన్ మార్చిన ఘనత పూరి జగన్నాథ్‌దే. కమర్షియల్ సినిమా హీరో అంటే పొకిరి, దేశముదురు, ఇడియట్‌ లా కూడా ఉండొచ్చని.. అలాంటి రోల్స్‌లోనూ హీరోలను ఆడియన్స్‌ యాక్సెప్ట్ చేస్తారని ప్రూవ్ చేశారు పూరి. ఈ ట్రెండ్ మరింతగా మారిపోయింది. కేజీఎఫ్ లాంటి సక్సెస్‌ల తరువాత హీరో క్యారెక్టర్‌ను మరింత రూడ్‌గా చూపిస్తున్నారు మేకర్స్‌. ఆడియన్స్‌ కూడా అలాంటి సినిమాలనే ఆదరిస్తున్నారు.

పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ పుష్ప సినిమాలో అల్లు అర్జున్‌ స్మగ్లర్‌గా కనిపించారు. అండర్ వరల్డ్‌లో ఎదగటానికి ఏదైనా చేసే వ్యక్తిగా బన్నీ తెర మీద కనిపించిన తీరుకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇన్నాళ్లు అల్లు అర్జున్‌ను స్టైలిష్‌ స్టార్‌గా చూసిన ఫ్యాన్స్.. పుష్ప సక్సెస్ తరువాత మాస్ హీరోయిజానికి ఐకాన్‌గా ఫీలవుతున్నారు. బాహుబలి లాంటి బిగ్ హిట్ తరువాత ప్రభాస్‌ కూడా నెగెటివ్‌ హీరోగా మారారు. సాహో సినిమాలో ఇంటర్నేషనల్‌ మాఫియా డాన్‌గా కనిపించారు డార్లింగ్‌. ఈ సినిమా సౌత్‌ ఆడియన్స్‌కు పెద్దగా కనెక్ట్ కాకపోయినా… నార్త్‌లో మాత్రం గట్టిగానే పెర్ఫామ్ చేసింది. అప్‌ కమింగ్ సినిమాల్లోనూ హీరోలు ఎక్కువగా నెగెటివ్ షేడ్స్‌లోనే కనిపిస్తున్నారు. ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న సలార్ సినిమాలో ప్రభాస్‌ రూత్‌లెస్‌ కిల్లర్‌గా కనిపించబోతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్‌ రాక్షసులే భయపడేంత రాక్షసుడిగా కనిపించబోతున్నారన్న హింట్ ఇచ్చారు మేకర్స్‌.

ఇవి కూడా చదవండి

ట్రిపులార్ తరువాత ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో కూడా వయలెన్స్ కాస్త ఎక్కువగానే కనిపించనుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన మోషన్‌ పోస్టర్‌లో ఎన్టీఆర్ రెండు భారీ ఆయుధాలతో కనిపించారు. ఈ లుక్‌ చూసి యాక్షన్‌ నెక్ట్స్ లెవల్‌లో ఉంటుందని ఫిక్స్ అయ్యారు ఆడియన్స్‌. ఇలా స్టార్ హీరోలంతా వయలెన్స్, నెగెటివ్‌ షేడ్స్ ఉన్న రోల్స్ చేస్తుండటంతో హీరోయిజానికి అర్థమే మారిపోతోంది.

Follow Us