- Telugu News Photo Gallery Cinema photos Bihar ips amit lodha Success story who captured chandan mahto inspired khakee web series
Success Story: ఐపీఎస్ ఆఫీసర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీస్.. ధైర్యశాలి ఆ అధికారి గురించి మీకు తెలుసా
బీహార్ చాప్టర్ వెబ్ సిరీస్ IPS అధికారి అమిత్ లోధా జీవితం ఆధారంగా రూపొందించబడింది. బీహార్‌కి చెందిన ఈ పోలీసు అధికారి గురించి తెలుసుకుందాం.
Updated on: Dec 01, 2022 | 5:39 PM

OTT ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌లో వెబ్ సిరీస్ ప్రస్తుతం చాలా చర్చనీయాంశమైంది. వెబ్ సిరీస్ పేరు.. ఖాకీ: ది బీహార్ చాప్టర్.. ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులకు బాగా నచ్చింది. అయితే ఈ వెబ్ సిరీస్ IPS అధికారి అమిత్ లోధా జీవితం ఆధారంగా రూపొందించబడిందని చాలా తక్కువ మందికి తెలుసు. బీహార్‌లో నేరాలు తారాస్థాయికి చేరుకున్న ఆ కాలాన్ని వెబ్ సిరీస్‌లో చూపించారు.

OTT ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌లో వెబ్ సిరీస్ ప్రస్తుతం చాలా చర్చనీయాంశమైంది. వెబ్ సిరీస్ పేరు.. ఖాకీ: ది బీహార్ చాప్టర్.. ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులకు బాగా నచ్చింది. అయితే ఈ వెబ్ సిరీస్ IPS అధికారి అమిత్ లోధా జీవితం ఆధారంగా రూపొందించబడిందని చాలా తక్కువ మందికి తెలుసు. బీహార్‌లో నేరాలు తారాస్థాయికి చేరుకున్న ఆ కాలాన్ని వెబ్ సిరీస్‌లో చూపించారు.

ఐపీఎస్ అధికారి అమిత్ లోధా ఆ సమయంలో బీహార్‌కు చెందిన భయంకరమైన నేరస్థుడు చందన్ మహ్తో ను అరెస్టు చేశారు. చందన్ మహ్తోను 'గబ్బర్ సింగ్ ఆఫ్ షేక్‌పురా' అని పిలిచేవారు. మహ్తో తన షార్ప్ షూటర్ పింటూ మహ్తోతో కలిసి మే 2006లో 15 మందిని చంపాడు. మహ్తోను ఐపీఎస్ అధికారి అరెస్ట్ చేయడం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. చర్చనీయాంశంగా మారింది. ధైర్యశాలి IPS అమిత్ లోధా గురించి తెలుసుకుందాం.

ఐపీఎస్ అధికారి కాకముందు అమిత్ ఐఐటీ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. ఢిల్లీలోని ఐఐటీ క్యాంపస్ లో అడ్మిషన్ కూడా తీసుకున్నారు. అయితే బహు సిగ్గరి అయిన అమిత్ కు ఐఐటీలో ప్రయాణం చాలా దారుణంగా సాగింది. దీని తర్వాత UPSC పరీక్షలో హాజరయ్యారు. దీంతో అమిత్ జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి.

బీహార్‌కు బదిలీ అయిన తర్వాత.. అమిత్ లోధా సంభవ్ అనే ప్రచారాన్ని ప్రారంభించారు. దీని లక్ష్యం బీహార్ లోని యువత సామర్థ్యాన్ని బయటకు తీసుకురావడం. అంతేకాదు అమరవీరుల కుటుంబాలకు సహాయం అందించడానికి ఉద్దేశించిన 'భారత్ కే వీర్' నిధిని సూపర్ స్టార్ అక్షయ్ కుమార్‌తో ప్రారంభించడంలో కూడా అమిత్ కీలక పాత్ర పోషించారు.

బీహార్‌లో పోస్టింగ్ పొందిన కొన్ని సంవత్సరాల తరువాత.. పోలీస్ గ్యాలంట్రీ మెడల్ ను అందుకున్నారు. రాంపూర్‌లో 9 మంది నక్సలైట్లను అరెస్టు చేసినందున అమిత్ కు ఈ పతకం లభించింది. అయితే అశోక్ మహతోను అరెస్ట్ చేసిన తర్వాత రాష్ట్రం నుంచి దేశ వ్యాప్తంగా అమిత్ ధైర్యానికి తగిన గుర్తింపు లభించింది. మూడు నెలల పాటు పోలీసులతో దొంగ పోలీసు ఆట ఆడుతూ మహతోను అరెస్టు చేశారు. అమిత్ జీవితం గురించి తెలియజేస్తూ.. బీహార్ డైరీస్ అనే పుస్తకాన్ని కూడా రాశారు. ఈ పుస్తకం ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ ప్రస్తుతం ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుంది.





























