AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varasudu: సంక్రాంతి బరిలో దిగనున్న ‘వారసుడు’.. ఆ రోజునే థియేటర్లలో సందడి చేయనున్న విజయ్..

విజయ్ చేతిలో టీతో స్టైలిష్ గా కనిపిస్తున్నారు. అయితే సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద మెగా ప్రాజెక్ట్ తలపడనున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న వాల్తేరు వీరయ్యతోపాటు.. నందమూరి నటసింహా రెడ్డి చిత్రాలతో ఢీకొటట్నుంది. అలాగే..తమిళంలో స్టార్ హీరో అజిత్ కుమార్ నటిస్తోన్న తునివు కూడా పొంగల్ బరిలో నిలిచింది.

Varasudu: సంక్రాంతి బరిలో దిగనున్న 'వారసుడు'.. ఆ రోజునే థియేటర్లలో సందడి చేయనున్న విజయ్..
Varisu
Rajitha Chanti
|

Updated on: Dec 01, 2022 | 3:28 PM

Share

దళపతి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అప్డేట్ రివీల్ చేశారు వరిసు మూవీ మేకర్స్. తమిళ్ స్టార్ విజయ్.. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటిస్తోన్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి 12న తెలుగుతోపాటు తమిళంలోనూ ఏకకాలంలో వరిసు (తెలుగులో వారసుడు) చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటిస్తూ.. ఈ మూవీ నుంచి విజయ్ సరికొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో విజయ్ చేతిలో టీతో స్టైలిష్ గా కనిపిస్తున్నారు. అయితే సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద మెగా ప్రాజెక్ట్ తలపడనున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న వాల్తేరు వీరయ్యతోపాటు.. నందమూరి నటసింహా రెడ్డి చిత్రాలతో ఢీకొటట్నుంది. అలాగే..తమిళంలో స్టార్ హీరో అజిత్ కుమార్ నటిస్తోన్న తునివు కూడా పొంగల్ బరిలో నిలిచింది.

గత కొద్ది రోజుల క్రితం ఈ సినిమా విడుదల విషయంలో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్స్ నుంచి పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం అవన్నీ క్లియర్ అయినట్లుగా సమాచారం. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగుతోపాటు.. తమిళం, హిందీలో విడుదల చేయనున్నరు. ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను హిందీలో విడుదల చేయస్తున్నట్లు దృవీకరించారు. మరోవైపు ఈ సినిమా నుంచి విడుదలైన రంజితమే సాంగ్ యూట్యూబ్‍లో ట్రెండ్ అవుతుంది. ఈ పాటకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తుంది.

ఇవి కూడా చదవండి

ఈ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌ ను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా బ్యానర్స్ పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా.. డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు.. ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, షామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త ఈ సినిమాలో నటిస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!