Rajeshwari Gayakwad: వివాదంలో టీమిండియా మహిళా క్రికెటర్.. సూపర్ మార్కెట్ సిబ్బందితో గొడవ.. ఆపై అనుచరుల దాడి
కొద్దిసేపటి తర్వాత క్రికెటర్‌తో సంబంధం ఉన్న కొందరు వ్యక్తులు సూపర్ మార్కెట్‌లోకి చొరబడి సిబ్బందిపై దాడి చేశారు. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. కాగా ఈ ఘటనకు సంబంధించి సూపర్ మార్కెట్ నిర్వాహకులు, సిబ్బంది రాజేశ్వరిపై పోలీసులు ఫిర్యాదు చేశారు.
టీమిండిమా మహిళా క్రికెటర్ రాజేశ్వరి గైక్వాడ్ వివాదంలో చిక్కుకుంది. ఆమె స్వస్థలం విజయపుర (కర్ణాటక)లోని ఓ సూపర్ మార్కెట్‌కు వెళ్లిన ఆమె ఏదో విషయమై అక్కడి సిబ్బందితో గొడవ పడింది. ఆ తర్వాత రాజేశ్వరి అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే కొద్దిసేపటి తర్వాత క్రికెటర్‌తో సంబంధం ఉన్న కొందరు వ్యక్తులు సూపర్ మార్కెట్‌లోకి చొరబడి సిబ్బందిపై దాడి చేశారు. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. కాగా ఈ ఘటనకు సంబంధించి సూపర్ మార్కెట్ నిర్వాహకులు, టీమిండియా క్రికెటర్ రాజేశ్వరిపై పోలీసులు ఫిర్యాదు చేశారు. అయితే ఇరు వర్గాలు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవడంతో ఎలాంటి కేసులు నమోదు చేయలేదు.
మరోవైపు ఈ దాడిలో స్వల్పంగా గాయపడిన సిబ్బందికి రాజేశ్వరి గైక్వాడ్ క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే రాజేశ్వరి ఎందుకు గొడవపడిందోతెలియదు కానీ.. చిల్లర గొడవతో అప్రతిష్టపాలైందని క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. రాజేశ్వరి గైక్వాడ్ భారత మహిళా క్రికెట్ జట్టులో కీలక ప్లేయర్. గత 8 ఏళ్లుగా భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడుతోంది. ఆమె టీమిండియా తరఫున రెండు టెస్టులు, 64 వన్డేలు, 44 టీ20 మ్యాచ్‌లు ఆడింది. 2017 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజేశ్వరి గైక్వాడ్ 15 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి అందరి ప్రశంసలు అందుకుంది. ఇటీవల బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో ఆమె టీమ్ ఇండియాలో కూడా భాగమైంది. ఇక్కడ భారత్ రజత పతకాన్ని గెలుచుకుంది. వన్డేల్లో రాజేశ్వరి 20.79 సగటుతో 99 వికెట్లు పడగొట్టింది. టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లకొస్తే.. రాజేశ్వరి 17.40 సగటుతో 54 వికెట్లు పడగొట్టింది.
India women’s cricketer Rajeshwari Gayakwad involved in altercation at super market pic.twitter.com/ZDDxqWfiW1
— Sanju Here ?? (@me_sanjureddy) December 1, 2022
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..