8 Sixes In An Over: ఒకే ఓవర్‌లో 8 సిక్సర్లు.. ఏకంగా 77 రన్స్‌.. రుతురాజ్‌ కన్నా ముందే రికార్డులకెక్కిన ఆ బ్యాటర్‌, బౌలర్లు ఎవరంటే?

విజయ్‌హజారే ట్రోఫీ-2022 ట్రోఫీలో భాగంగా సోమవారం ఉత్తరప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ అరుదైన రికార్డును సృష్టించాడు రుతురాజ్. ఈ మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడిన అతను 159 బంతుల్లో మొత్తం 220 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా10 ఫోర్లు, 16 సిక్సర్లు ఉండడం గమనార్హం.

8 Sixes In An Over: ఒకే ఓవర్‌లో 8 సిక్సర్లు.. ఏకంగా 77 రన్స్‌.. రుతురాజ్‌ కన్నా ముందే రికార్డులకెక్కిన ఆ బ్యాటర్‌, బౌలర్లు ఎవరంటే?
Ruturaj Gaikwad
Follow us
Basha Shek

|

Updated on: Nov 29, 2022 | 11:51 AM

క్రికెట్‌ ప్రపంచంలో టీమిండియా యంగ్ ప్లేయర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ పేరు మార్మోగుతోంది. ఒకే ఓవర్‌లో ఏడు సిక్సర్లు కొట్టడమే ఇందుకు కారణమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విజయ్‌హజారే ట్రోఫీ-2022 ట్రోఫీలో భాగంగా సోమవారం ఉత్తరప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ అరుదైన రికార్డును సృష్టించాడు రుతురాజ్. ఈ మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడిన అతను 159 బంతుల్లో మొత్తం 220 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా10 ఫోర్లు, 16 సిక్సర్లు ఉండడం గమనార్హం. కాగా ఈ ఇన్నింగ్స్‌తో లిస్ట్‌-ఏ క్రికెట్‌తో పాటు జాతీయ, అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనూ ఒకే ఓవర్‌లో ఏడు సిక్సర్లు కొట్టిన మొదటి ప్లేయర్‌గా రుతురాజ్‌ రికార్డుల్లోకెక్కాడు. అంతకుముందు హెర్షల్‌ గిబ్స్‌ (దక్షిణాఫ్రికా), పెరెరా (శ్రీలంక), జస్‌కరణ్‌ మల్హోత్ర (అమెరికా) ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టారు. అంతుకుముందు భారత్‌ తరఫున రంజీ ట్రోఫీలో రవిశాస్త్రి ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టగా.. 2007 టీ20 ప్రపంచకప్‌లో యువరాజ్‌ సింగ్‌.. ఇంగ్లండ్‌ బౌలర్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో ఆరు సిక్సర్లు బాదేశాడు. అయితే రుతురాజ్‌ కన్నా ముందే ఈ రికార్డు న్యూజిలాండ్‌ ఫస్ట్‌ క్లాస్‌ క్రికెటర్‌ లీ జెర్మన్‌ పేరిట ఉంది. అతను ఏకంగా 8 సిక్సర్లు కొట్టడం గమనార్హం.

ఇప్పటికీ అతనిదే రికార్డు..

1990లో న్యూజిలాండ్‌ లో జరిగిన ఓ దేశవాళీ క్రికెట్‌ మ్యాచ్‌లో ఈ అద్భుతం చోటు చేసుకుంది. వెల్లింగ్టన్‌, కాంటర్‌బరీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ క్రికెటర్‌ లీ జెర్మన్‌ ఈ అరుదైన రికార్డును అందుకున్నాడు. వాన్స్‌ వేసిన ఆ బౌలింగ్‌లో ఏకంగా 8 సిక్సర్లు కొట్టిన జెర్మన్‌ ఏకంగా 77 పరుగులు రాబట్టాడు. అయితే ఇక్కడ బౌలింగ్‌ తప్పిదం కూడా ఉంది. అదేంటంటే వాన్స్‌కు అసలు బౌలింగ్‌ రాదు. అయినా జట్టు కెప్టెన్ అతనికే బంతిని అందించాడు. దీంతో అతను ఏకంగా 17 నోబాల్స్‌ సహా మొత్తం 22 బంతులు వేశాడు. అంటే 5 బంతులే! ఇందులోనే లీ జెర్మన్‌ 8 సిక్స్‌లు బాదాడు. ఈ ఓవర్లో మొత్తం 77 పరుగులు (0,4,4,4,6,6,4,6,1,4,1,0,6,6,6,6,6,0,0,4,0,1) వచ్చాయి. ఇప్పటికీ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అత్యధిక పరుగుల రికార్డు ఇదే. అయితే చివరకు మ్యాచ్‌ డ్రాగా ముగియడం గమనార్హం. అయితే, ఆ మ్యాచ్​లో ప్రత్యర్థి జట్టు.. కావాలనే అదనపు పరుగులు ఇచ్చింది. బ్యాటర్.. సిక్సులు, ఫోర్లు కొట్టేలా బంతులు విసిరింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే