Gautham-Manjima: పెళ్లి పీటలెక్కిన ప్రేమ పక్షులు.. ఘనంగా హీరో, హీరోయిన్ల వివాహం.. ట్రెండింగ్‌లో ఫొటోస్‌

కుటుంబసభ్యులు, అతికొద్ది మంది సన్నిహితులు, స్నేహితల సమక్షంలో చెన్నైలోని ఓ హోటల్‌లో గౌతమ్, మంజిమాల పెళ్లి వేడుకగా జరిగింది. సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Gautham-Manjima: పెళ్లి పీటలెక్కిన ప్రేమ పక్షులు.. ఘనంగా హీరో, హీరోయిన్ల వివాహం.. ట్రెండింగ్‌లో ఫొటోస్‌
Gautham,manjima
Follow us
Basha Shek

|

Updated on: Nov 28, 2022 | 12:35 PM

కోలీవుడ్‌ ప్రేమ పక్షులు గౌతమ్‌ కార్తిక్‌ – మంజిమా మోహన్‌ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఎంతోకాలం నుంచి ప్రేమలో ఉన్న వీరిద్దరూ ఇరు కుటుంబసభ్యుల అంగీకారంతో సోమవారం పెళ్లి పీటలెక్కారు. కుటుంబసభ్యులు, అతికొద్ది మంది సన్నిహితులు, స్నేహితల సమక్షంలో చెన్నైలోని ఓ హోటల్‌లో గౌతమ్, మంజిమాల పెళ్లి వేడుకగా జరిగింది. సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. పెళ్లి దుస్తుల్లో ఎంతో అందంగా మెరిసిపోతోన్న ఈ జంటకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. సెలబ్రిటీలతో పాటు అభిమానులు, నెటిజన్లు నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కాగా అభినందన, అన్వేషణ తదితర సినిమాలతో ఆకట్టుకున్న నిన్నటి తరం హీరో కార్తిక్‌ వారసుడే ఈ గౌతమ్‌ కార్తీక్‌. మణిరత్నం తెరకెక్కించిన కాదల్‌ (తెలుగులో కడలి) తో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే ఉత్తమ డెబ్యూ హీరోగా ఫిల్మ్‌ఫేర్‌ పురస్కారం అందుకున్నాడు. ఇక మంజిమా మోహన్‌ విషయానికొస్తే.. తెలుగులో నాగచైతన్య సరసన సాహసం శ్వాసగా సాగిపో అనే చిత్రంలో నటించింది. ఇందులో చైతూ ప్రియురాలిగా ఆమె పోషించిన లీలా పాత్రకు మంచి పేరొచ్చింది. ఆ తర్వాత ఎన్టీఆర్ బయోపిక్‌లోనూ నారా భువనేశ్వరీ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. కొన్ని నెలల క్రితం విష్ణు విశాల్‌ ఎఫ్‌ఐఆర్‌ చిత్రంలోనూ ఓ కీలక పాత్రలో నటించింది. మంజిమా, గౌతమ్ కార్తిక్ ఇద్దరూ కలిసి దేవరట్టం అనే చిత్రంలో నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరి ప్రేమకు పునాది పడింది. మొదట మంచి స్నేహితులుగా మారారు. ఆతర్వాత ఫ్రెండ్‌షిప్‌ కాస్తా ప్రేమగా చిగురించింది. ఇప్పుడు పెళ్లితో తమ బంధాన్ని మరింత దృఢంగా మార్చుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..