Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Avantika Dasani: అచ్చం అమ్మలాగానే.. టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న సీనియర్ హీరోయిన్ కూతురు

విభిన్నమైన కథాంశంతో వచ్చిన ఈ సినిమా అటు థియేటర్లు, ఓటీటీల్లోనూ మంచి విజయం సాధించింది. దీంతో వెంటనే తన తర్వాతి ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చాడు గణేశ్‌. ఈసారి యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు

Avantika Dasani: అచ్చం అమ్మలాగానే.. టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న సీనియర్ హీరోయిన్ కూతురు
Nenu Student Sir
Follow us
Basha Shek

|

Updated on: Nov 29, 2022 | 7:05 AM

స్వాతిముత్యం వంటి డీసెంట్‌ హిట్‌ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు టాలీవుడ్‌ అగ్రనిర్మాత బెల్లంకొండ సురేశ్‌ తనయుడు బెల్లంకొండ గణేశ్‌. విభిన్నమైన కథాంశంతో వచ్చిన ఈ సినిమా అటు థియేటర్లు, ఓటీటీల్లోనూ మంచి విజయం సాధించింది. దీంతో వెంటనే తన తర్వాతి ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చాడు గణేశ్‌. ఈసారి యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అదే నేను స్టూడెంట్ సర్. ఎస్వీ2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నంబర్ 2 గా వస్తున్న ఈ చిత్రాన్ని నాంది సతీష్ వర్మ నిర్మిస్తుండగా నూతన దర్శకుడు రాకేష్ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడు కృష్ణ చైతన్య కథను అందించారు. ఇటివలే విడుదల చేసిన ఈ చిత్రం టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా చిత్ర యూనిట్ మ్యూజికల్ ప్రమోషన్స్ ని ప్రారంభించింది.

నేను స్టూడెంట్ సర్ ఫస్ట్ సింగిల్ మాయే మాయే డిసెంబర్ 1న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన సాంగ్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో గణేష్, అవంతికల జోడి చూడముచ్చటగా ఉంది. ఈ చిత్రంతో అలనాటి నటి భాగ్యశ్రీ కూతురు అవంతిక దస్సాని హీరోయిన్ గా అరంగేట్రం చేస్తోంది. కాగా సముద్రఖని, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. అనిత్ మధాడి డీవోపీగా, చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. కళ్యాణ్ చక్రవర్తి ఈ చిత్రానికి డైలాగ్స్ అందిస్తున్నారు. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Avantika (@avantikadassani)

View this post on Instagram

A post shared by Avantika (@avantikadassani)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..