Tamannaah: ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన మిల్కీబ్యూటీ.. ఒక్క ఫోటోతో హింట్ ఇచ్చేసిందా..?

ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్ సినిమా ఈ అమ్మడికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో తమన్నా నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Tamannaah: ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన మిల్కీబ్యూటీ.. ఒక్క ఫోటోతో హింట్ ఇచ్చేసిందా..?
Thamannha
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 29, 2022 | 7:29 AM

టాలీవుడ్ అందాల తారల్లో మిల్కీ బ్యూటీ తమన్నా ఒకరు. మంచు మనోజ్ నటించిన శ్రీ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ భామ. ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్ సినిమా ఈ అమ్మడికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో తమన్నా నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత ఈ చిన్నది స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తక్కువ సమయంలోనే టాప్ హీరోల సరసన ఛాన్స్ లు అందుకొని టాలీవుడ్ లో రాణిస్తుంది ఈ బ్యూటీ. తెలుగుతో పాటు తమన్నా తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసింది. ఇటీవల వెబ్ సిరీస్ లలోకి కూడాచేసింది ఈ మిల్కీ బ్యూటీ. ఇదిలా ఉంటే ఈ ఆమధ్య కాలంలో టాలీవుడ్ సినిమాలు తగ్గించింది ఈ బ్యూటీ.. అలాగే రీసెంట్ గా హిందీలో బాబ్లీ బౌన్సర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది.

ఇదిలా ఉంటే తాజాగా తమన్నాకు సంబంధించిన ఓ వార్త ఫిలిమ్ సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతోంది. హీరోయిన్స్ పెళ్లి వార్తలు ఈ మధ్య కాలంలో ఎక్కువగానే వినిపిస్తున్నాయి. ఇప్పటికే కీర్తిసురేష్ పెళ్లి చేసుకోబోతుందని ఓ టాక్ వైరల్ అవుతోంది. అలాగే ఇప్పుడు తమన్నా పెళ్లి విషయం కూడా చర్చల్లోకి వచ్చింది. తమన్నా షేర్ చేసిన ఒక ఫోటో ఈ వార్తలకు కారణం అయ్యింది. ఇంతకు తమన్నా షేర్ చేసిన ఫొటోలో ఏమున్నదంటే.

ఇవి కూడా చదవండి

మిల్కీబ్యూటీ మెహందీ పెట్టుకున్న పిక్ పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు ‘మెహండేటరీ’ అని కామెంట్ చేసింది. దాంతో తమన్నా గుడ్ న్యూస్ చెప్పనుందంటూ వార్తలు వెల్లువెత్తుతున్నాయి. తమన్నా పెళ్లి కూతురవుతుంది కాబట్టే మెహందీ పెట్టుకుందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. మిల్కీబ్యూటీ మ్యారేజ్ ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తతో జరుగబోతుందని వార్తలు వైరల్ అవుతున్నాయి.. ఇటీవల ‘‘ప్రొఫెషనల్‌‌‌గా బిజీగా ఉండడం వల్ల పర్సనల్ లైఫ్ మీద పెద్దగా ఫోకస్ చెయ్యలేకపోయాను.. పెళ్లికి నేనేం వ్యతిరేకిని కాను.. వీలు చూసుకుని, వెడ్డింగ్ చేసుకుని పిల్లల్ని కూడా కంటాను’’ అని కామెంట్ చేసింది..మరి నిజంగానే తమన్నా గుడ్ న్యూస్ చెప్తుందేమో చూడాలి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?