Pathaan: షారుక్ ఖాన్ సినిమా కోసం సరికొత్త ప్రయోగం.. ట్రైల‌ర్ కంటే ముందే

జీరో సినిమా తర్వాత షారుక్ ఖాన్ నటిస్తున్న సినిమా ఇది. ఈ మూవీ కోసం షారుక్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా, ఏస్ డైరెక్ట‌ర్ సిద్ధార్థ్ ఆనంద్ క‌లిసి ‘పఠాన్’

Pathaan: షారుక్ ఖాన్ సినిమా కోసం సరికొత్త ప్రయోగం.. ట్రైల‌ర్ కంటే ముందే
Pathan Movie
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 29, 2022 | 7:30 AM

బాలీవుడ్ సూపర్ స్టార్ షారూ క్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పఠాన్. షారూ క్ ఖాన్ వచ్చి చాలా కాలం అయ్యింది. షారూ క్ ఖాన్ న‌టిస్తోన్న ప‌వ‌ర్ ప్యాక్‌డ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ గా రాబోతుంది ‘పఠాన్’. జీరో సినిమా తర్వాత షారుక్ ఖాన్ నటిస్తున్న సినిమా ఇది. ఈ మూవీ కోసం షారుక్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా, డైరెక్ట‌ర్ సిద్ధార్థ్ ఆనంద్ క‌లిసి ‘పఠాన్’ చిత్రాన్ని ఇండియా బిగ్గెస్ట్ యాక్ష‌న్ చిత్రంగా, విజువ‌ల్ వండ‌ర్‌గా మార్చ‌టానికి అడుగులు వేస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ య‌ష్ రాజ్ ఫిలింస్ ఈ చిత్రాన్ని అద్భుత‌మైన విజువ‌ల్స్‌తో, ఆశ్చ‌ర్య‌ప‌రిచే యాక్ష‌న్‌తో రూపొందిస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా  దీపికా ప‌దుకొనె నటిస్తుండగా.. జాన్ అబ్ర‌హం కీలకపాత్రలో కనిపించనున్నాడు.  జ‌న‌వ‌రి 25, 2023లో హిందీ, తెలుగు, త‌మిళ భాష‌ల్లో ‘పఠాన్’ సినిమా రిలీజ్ అవుతుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఆసక్తికర విషయం తెలిపారు మూవీ దర్శకుడు.  రీసెంట్‌గా విడుద‌లైన ‘ప‌ఠాన్’ టీజ‌ర్ సోష‌ల్ మీడియాలో సెన్సేష‌న్‌ను క్రియేట్ చేసింది. నాలుగేళ్ల త‌ర్వాత షారూక్ ఖాన్ న‌టిస్తోన్న ఈ చిత్రంలోయాక్షన్  యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చూసి ఆడియెన్స్ ఊగిపోయారు. దీపికా ప‌దుకొనెని ఇంత‌కు ముందెన్న‌డూ చూడ‌ని పాత్ర‌లో చూడ‌బోతున్నార‌ని.. దేశాన్ని కాపాడ‌టానికి షారూక్, జాన్ అబ్ర‌హం మ‌ధ్య న‌డిచే ఫైట్స్ ఇంత‌కు ముందు సిల్వ‌ర్ స్క్రీన్‌పై చూడ‌ని విధంగా ఉంటాయ‌ని మేక‌ర్స్ చెప్పుకొస్తున్నారు.

‘పఠాన్’ మూవీ క‌థాంశం దాని చుట్టూ రూపొందించిన ఇత‌ర ఎలిమెంట్స్ ఆడియెన్స్‌ను అబ్బుర‌ప‌రిచేలా ఉంటాయని అంటున్నారు దర్శకనిర్మాతలు. ఇప్ప‌టికే సినిమా కోసం ప్రేక్ష‌కులు ఎలా ఎదురు చూస్తున్నార‌నే విష‌యాన్ని రీసెంట్‌గా వ‌చ్చిన టీజ‌ర్‌, పోస్ట‌ర్స్‌కు వ‌చ్చిన రెస్పాన్స్ చూస్తేనే అర్థ‌మ‌వుతుంది. ఇప్ప‌టికే ‘పఠాన్’ ప్ర‌మోష‌న్స్ శ‌ర‌వేగంగా జరుగుతున్నాయి. సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను మ‌రింత‌గా పెంచేలా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌టానికి కంటే ముందే జ‌న‌వ‌రిలో రెండు అద్బుత‌మైన పాట‌ల‌ను విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు నిర్ణ‌యించుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు సిద్ధార్థ్ ఆనంద్ మాట్లాడుతూ ‘‘పఠాన్ చిత్రంతో రెండు అద్భుతమైన పాటలున్నాయి. ప్రేక్షకులు ఊహించ‌లేనంత గొప్ప‌గా ఉండ‌ట‌మే కాదు.. ఆ ఏడాదిలో చార్ట్ బ‌స్ట‌ర్‌లో అవే టాప్ సాంగ్స్‌గా నిలుస్తాయి. కావున ఆ పాట‌ల‌ను ప్రేక్ష‌కులు ఆస్వాదించ‌టానికి కావాల్సినంత స‌మ‌యం కూడా ఉండాల‌ని మేం భావించాం. అందుక‌నే ట్రైల‌ర్ కంటే ముందే పాట‌ల‌ను విడుద‌ల చేస్తున్నాం. డిసెంబ‌ర్‌లో ప్ర‌పంచ‌మంతా డిసెంబ‌ర్‌లో పార్టీ, హాలీడే మూడ్‌లో ఉంటుంది. కాబ‌ట్టి పాట‌ల‌ను విడుద‌ల చేయ‌టానికి అది కూడా ఓ కార‌ణం. సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను పెంచుతూ.. సినిమా రిలీజ్ వ‌ర‌కు ఆ ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను క్యారీ చేయ‌టం మా ప్ర‌మోష‌న‌ల్ స్ట్రాటజీలో ఓ భాగం. కాబ‌ట్టి ప‌ఠాన్ మ్యూజిక్‌కు డాన్సులు చేయ‌టానికి సిద్ధంగా ఉండండి అని చెప్పుకొచ్చారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?