6 ఏళ్ల తర్వాత జట్టులోకి రీ-ఎంట్రీ.. పాక్ బౌలర్లకు సుస్సు పోయించాడు.. ఉన్నంతసేపు ఊచకోతే.. ఎవరంటే?

పాకిస్థాన్‌తో జరుగుతున్న రావల్పిండి టెస్టులో ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ సెంచరీతో కదంతొక్కాడు. జాక్ క్రాలీతో కలిసి ఓపెనింగ్‌కు..

6 ఏళ్ల తర్వాత జట్టులోకి రీ-ఎంట్రీ.. పాక్ బౌలర్లకు సుస్సు పోయించాడు.. ఉన్నంతసేపు ఊచకోతే.. ఎవరంటే?
Ben Duckett
Follow us

|

Updated on: Dec 01, 2022 | 7:37 PM

పాకిస్థాన్‌తో జరుగుతున్న రావల్పిండి టెస్టులో ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ సెంచరీతో కదంతొక్కాడు. జాక్ క్రాలీతో కలిసి ఓపెనింగ్‌కు దిగిన డకెట్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి.. కెరీర్‌లో తన మొదటి సెంచరీ(107) నమోదు చేసుకున్నాడు. పాకిస్థాన్ బౌలర్ హరీస్ రౌఫ్‌ వేసిన ఓవర్‌లో ఫైన్ లెగ్ మీదుగా ఫోర్ కొట్టి డకెట్ 107 బంతుల్లో తన సెంచరీని పూర్తి చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతడు మొత్తంగా 15 ఫోర్లు బాదాడు. డకెట్‌తో పాటు జాక్ క్రాలీ(122) కూడా సెంచరీ చేయగా.. వీరిద్దరూ కలిసి మొదటిగా వికెట్‌కు 233 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఉన్నంతసేపు ఈ ఇద్దరు బ్యాటర్లు పాక్ బౌలర్లను ఊచకోత కోశారు.

మరోవైపు డకెట్‌కు ఈ సెంచరీ ఎంతో ప్రత్యేకమైనది. దాదాపు ఆరేళ్ల తర్వాత జట్టులోకి పునరాగమనం చేసిన డకెట్.. కెరీర్‌లో తొలి శతకాన్ని పాకిస్థాన్‌పై నమోదు చేశాడు. చిట్టగ్యాంగ్‌లో బంగ్లాదేశ్‌తో డకెట్ తన చివరి టెస్టు మ్యాచ్‌ను 2016వ సంవత్సరంలో ఆడాడు. గత ఏడాది వరకు టెస్టు జట్టులోకి తిరిగి వస్తానని బెన్ డకెట్ ఏమాత్రం భావించలేదు. ఇంగ్లాండ్ టెస్టు జట్టు కొంతకాలంగా పేలవ ఫామ్ కొనసాగిస్తుండగా.. బ్రెండన్ మెక్‌కలమ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత టీం రూపురేఖలు మొత్తం మారిపోయాయి. విధ్వంసకర బ్యాటర్లకు తుది జట్టులో చోటు దక్కింది. అందులో ఒకరిగా బెన్ డకెట్ పేరు ఉండటం విశేషం. కాగా, పాకిస్తాన్‌తో జరుగుతోన్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ బ్యాటర్లు పిచ్చ కొట్టుడు కొడుతున్నారు. మొదటి రోజు ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 4 వికెట్లు కోల్పోయి 506 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో హ్యారీ బ్రూక్(101), బెన్ స్టోక్స్(34) ఉన్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం..