PAK vs ENG: ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు.. 16 బంతుల్లో 68 రన్స్‌.. పాక్‌ బౌలర్లకు చుక్కలు చూపించిన యంగ్‌ ప్లేయర్‌

హ్యారీ బ్రూక్ మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. క్రీజులోకి రాగానే పాక్‌ బౌలర్లను ఉతికారేయడం మొదలుపెట్టిన బ్రూక్ సౌద్.. షకీల్ వేసిన 68వ ఓవర్‌లో విశ్వరూపం ప్రదర్శించాడు. ఏకంగా 6 బంతుల్లో 6 ఫోర్లు కొట్టి దిగ్గజాల సరసన చోటు సంపాదించాడు.

PAK vs ENG: ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు.. 16 బంతుల్లో 68 రన్స్‌.. పాక్‌ బౌలర్లకు చుక్కలు చూపించిన యంగ్‌ ప్లేయర్‌
Harry Brook
Follow us
Basha Shek

|

Updated on: Dec 01, 2022 | 9:32 PM

రావల్పిండి వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు చెలరేగింది. తొలిరోజు ఏకంగా నలుగురు బ్యాటర్లు సెంచరీలు సాధించారు. ఓపెనర్లు జాక్ క్రాలే 111 బంతుల్లో 122 పరుగులు, బెన్ డకెట్ 110 బంతుల్లో 107 పరుగులు చేశారు. ఆ తర్వాత వచ్చిన ఓలి పోప్ కూడా 104 బంతుల్లో 108 పరుగులు చేశాడు. కానీ మూడో స్థానంలో వచ్చిన జో రూట్ 23 పరుగులు చేసి జాహిద్ మెహమూద్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయ్యాడు. ఈ దశలో బరిలోకి దిగిన యువ బ్యాట్స్‌మెన్ హ్యారీ బ్రూక్ మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. క్రీజులోకి రాగానే పాక్‌ బౌలర్లను ఉతికారేయడం మొదలుపెట్టిన బ్రూక్ సౌద్.. షకీల్ వేసిన 68వ ఓవర్‌లో విశ్వరూపం ప్రదర్శించాడు. ఏకంగా 6 బంతుల్లో 6 ఫోర్లు కొట్టి దిగ్గజాల సరసన చోటు సంపాదించాడు.

ఈ ఓవర్‌లో షకీల్ వేసిన మొదటి బంతిని ఔట్ ఆఫ్ ఆఫ్‌లో ఫోర్ కొట్టిన బ్రూక్, రెండో బంతిని ఎక్స్‌ట్రా కవర్‌గా కొట్టి బౌండరీ బాదాడు. అతను 3వ బంతిని ఆకర్షణీయమైన ఆఫ్‌సైడ్ షాట్‌తో బౌండరీకి ​​పంపాడు. అలాగే, 4వ బంతిని ఆఫ్‌సైడ్‌కి ఫోర్‌గా తరలించగా, 5వ బంతిని ఎక్స్‌ట్రా కవర్‌కు పంపించాడు. ఇక ఓవర్‌ చివరి బంతిని మిడ్ వికెట్ బౌండరీగా పంపి మొత్తం 24 పరుగులు పిండుకున్నాడు బ్రూక్‌. కాగా ఈ మ్యాచ్‌లో కేవలం 80 బంతుల్లోనే 14 ఫోర్లు, 2 సిక్సర్లతో కెరీర్‌లో తొలి సెంచరీని పూర్తి చేశాడు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ జట్టు 4 వికెట్లు కోల్పోయి 506 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ (101), కెప్టెన్ బెన్ స్టోక్స్ (34) క్రీజులో ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే