AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kalpika Ganesh: ఆస్పత్రి బెడ్‌పై నటి కల్పిక.. ఆ సమస్యతోనే చేరిందా?

ఇదిలా ఉంటే యశోద సినిమా ప్రమోషన్లలో భాగంగా కల్పిక చేసిన కొన్ని వ్యాఖ్యలు టాలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. హీరోయిన్స్‌ కంటే అందంగా కనిపిస్తున్నానని అందుకే తనను పక్కన పెడుతున్నారని ..

Kalpika Ganesh: ఆస్పత్రి బెడ్‌పై నటి కల్పిక.. ఆ సమస్యతోనే చేరిందా?
Actress Kalpika Ganesh
Basha Shek
|

Updated on: Nov 29, 2022 | 8:58 AM

Share

కల్పికా గణేశ్‌.. సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్‌తో దూసుకెళుతోన్న ఈ అందాల తారకు అభిమానులు బాగానే ఉన్నారు. 2009లోనే ప్రయాణం సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ సొగసరి ఆరెంజ్‌, నమో వెంకటేశ, జులాయి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, పడిపడి లేచే మనసు, మై డియర్‌ మార్తాండం, హిట్‌..ది ఫస్ట్‌ కేస్‌ తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. ఇటీవల సమంత ప్రధాన పాత్ర పోషించిన యశోదలోనూ ఓ కీలక పాత్రలో నటించి మెప్పించింది. ఇదిలా ఉంటే యశోద సినిమా ప్రమోషన్లలో భాగంగా కల్పిక చేసిన కొన్ని వ్యాఖ్యలు టాలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. హీరోయిన్స్‌ కంటే అందంగా కనిపిస్తున్నానని అందుకే తనను పక్కన పెడుతున్నారని దానివల్లే తక్కువ సినిమాలు చేశానని ఇటీవలే ఆమె చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి. అంతేగాక సమంతలాగే తాను కూడా పదమూడేళ్లుగా మయోసైటిస్‌తో పోరాడుతున్నానంటూ సంచలన విషయాన్ని బయటపెట్టింది.

ఇదిలా ఉంటే తాజాగా కల్పిక షేర్‌ చేసిన ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ఆమె ఆస్పత్రి బెడ్‌పై ఉండడం ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. ‘ఆల్‌ ఈజ్‌ వెల్‌ దట్‌ ఎండ్స్‌ వెల్‌. లుంబార్‌ రాడిక్యులోపతి విజయవంతమైంది. నా పోరాటం చివరికి ఎలాంటి సత్ఫలితాలనిస్తుందో చూడాలి’ అని రాసుకొచ్చింది కల్పిక. రాడిక్యులర్‌ పెయిన్‌ అంటే వెన్నెముక ద్వారా నొప్పి తొడలు, పాదాల వరకు ప్రయాణిస్తుంది. దీనివల్ల మనిషి ఎక్కువసేపు నిల్చోలేకపోవడంతోపాటు బలహీనంగా మారుతారు. కాగా ఆస్పత్రిలో చేరిన కల్పికా త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..